BIG BOOST TO ANNAMAIAH SANKEERTANS BY TTD-EO _ జ‌న ‌బాహుళ్యంలోకి అర్థ తాత్పర్యాలతో అన్నమయ్య సంకీర్త‌న‌లు – టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

ARTHA -TATPARYA SAHITA ANNAMACHARYA SANKEERTANA LAHIRI BOOK RELEASED BY EO

 

TIRUPATI, 22 MAY 2022: TTD is giving a major boost to Padakavita Pitamaha Annamacharya through various activities and bringing out Artha Tatparya Sahita Sankeertans book is a part of it, said TTD EO Sri AV Dharma Reddy.

 

Speaking the last day of the week-long 614th Annamacharya Jayanthi fete held at Annamacharya Kalamandiram in Tirupati on Sunday evening after releasing Annamacharya Sankeertana Lahari volume 1, the EO said our prime focus is to make the public know about the meaning of every word of the Sankeertan so that they enjoy the beauty of the song with more happiness.

 

He said a majority of the Sankeertans of Annamacharya were dedicated to Venkateswara, Sri Rama Chandra and Anjaneya. “Though we have designed music to 4000 to 4500 Sankeertans we don’t have their meaning. So we commenced this great work which started initially in 1922 and became a reality in 2022 almost after 100 years with the blessings of Lord Venkateswara, he asserted.

 

Adding further he said, TTD has decided to bring out all the songs in 29 volumes in next two years. He also thanked all the stalwarts who strived to bring out Artha Tatparyam for 512 Sankeertans in first volume.

 

Later he said though TTD has been doing a lot of activities as a tribute to the great saint-poet including organizing his Jayanthi and Vardhanti fetes in a big manner, rendering Annamacharya Sankeertans every day at Nada Neerajanam and Sahasra Deepalankara Seva, the massive meeting hall named after Padakavita Pitamaha and many more some vested interests are trying to malign the image of TTD among the public by spreading false news that we have ignored Annamacharya which is absolutely baseless and urged everyone to witness the reality.

 

Later the EO complimented Sri Grandhi Ramesh, a donor from Visakhapatnam for his largesse, who came forward to print huge numbers of the volume.

 

Annamacharya Project Director Dr A Vibhishana Sharma, scholars Dr Samudrala Lakshmanaiah, Dr Syamalananda Prasad, Sri Sarvottama Rao, Sri Varaprasad, Dr G Balakrishna Prasad also shared some interesting facts that how they worked day and night in on-line during Covid Pandemic to bring out the book.

 

Later the EO felicitated all the scholars and donor with Srivari Prasadams.

 

A large number of art lovers from the City participated in the event.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జ‌న ‌బాహుళ్యంలోకి అర్థ తాత్పర్యాలతో అన్నమయ్య సంకీర్త‌న‌లు – టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

– అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -1 ఆవిష్కరణ

– ఘనంగా ముగిసిన అన్నమయ్య జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2022 మే 22: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను అర్థ తాత్పర్యాలతో ప్రజలందరికీ చేరువ చేసేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాయంత్రం ఈవో అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -1 ఆవిష్కరించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ శ్రీ తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించినట్లు తెలిపారు. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి, వెంకటాద్రి, శ్రీరామచంద్రమూర్తి, శ్రీ కృష్ణుడు, శ్రీ ఆంజనేయ స్వామి, భగవద్గీతలోని కీర్తనలు ఉన్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలలో ప్రతి సంకీర్తనకు అర్థ తాత్పర్యాలు, ఆ సంకీర్తన ఏ సందర్భంలో రాశారు, మూలం ఏమిటి అనే విశేష అంశాలు తెలిస్తే గాయకులు భావ భావయుక్తంగా ఆలపిస్తారన్నారు.

టీటీడీ ఎస్.వి.రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 4,500 సంకీర్తనలను స్వరపరచి రికార్డు చేసినట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో 1922 నుంచి 2022 వరకు అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత స్వామివారి అనుగ్రహంతో అన్నమయ్య రచించిన సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలతో భక్తుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కలిగిందన్నారు. 16 మంది నిష్ణాతులైన ప్రముఖ పండితులు అన్నమయ్య సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలు, విశేష అర్థాలను సమకూర్చారని చెప్పారు. రాబోవు రెండు సంవత్సరాలలో 29 గ్రంధాలు ఆవిష్కరించాలని పండితులను కోరారు.

అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా తిరుమల శ్రీవారి వివిధ ఆర్జిత సేవల్లో, తిరుమల నాదనీరాజనం వేదికపై, శ్రీనివాస కల్యాణంలో దాదాపు 300 మందికి పైగా కళాకారులతో అన్నమయ్య సంకీర్తనలను విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఆయన వివరించారు. టీటీడీ అన్నమయ్య జయంతి వర్ధంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొందరు అన్నమయ్యను విస్మరించిందని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కావున ప్రజలు టీటీడీ చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సహించాలని ఈవో కోరారు.

అంతకుముందు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఆచార్య రాణి సదాశివమూర్తి ” అన్నమయ్య కీర్తించిన దేవతామూర్తులు ” అనే అంశంపై ఉపన్యసించారు.

తరువాత తిరుపతికి చెందిన శ్రీమతి రాధా బృందం సంగీత సభ నిర్వహించారు.

మహతి కళాక్షేత్రంలో తిరుపతికి చెందిన కుమారి కోనేరు లక్ష్మీరాజ్యం బృందం అన్నమయ్య సంకీర్తన లహరి గాత్ర సంగీతం, తిరుపతికి చెందిన శ్రీమతి హర్షిత బృందం భరతనాట్యం కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్. విభీషణ శర్మ, టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ప్రముఖ పండితులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య , శ్రీ సర్వోత్తమరావు శ్రీ శ్యామలానందప్రసాద్, శ్రీ పేరం నాయుడు, గ్రంథ రచనకు ఆర్థిక సహకారం అందించిన శ్రీ గ్రంథి రాజేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.