RITUALS ENTER DAY 2 AT BHUVANESHWAR _ భువనేశ్వర్ శ్రీవారి ఆలయంలో రెండవ రోజు కార్యక్రమ వివరాలు
SALAGRAMA HARAM DONATED
BHUVANESHWAR, 22 MAY 2022: On the second day of ongoing religious activities at Sri Venkateswara temple in Bhuvaneshwar, a series of agamic rituals took place on Sunday.
During the day Kankana Dharana, Nava Kalasa Snapanam, Panchagavya Adhivasam were performed. As part of it, the idol of Sri Venkateswara Swamy was rendered holy bath with the aromatic ingredients from nine vessels.
Later in the evening, Kalasa Sthapana, Agni Pratistha, Ukta Homam will be observed by the archakas under the supervision of Agama Advisor Dr Vedantam Vishnu Bhattacharyulu.
Deputy EO Sri Gunabhushan Reddy, All Projects Program Officer Sri Vijayasaradhi, AEO Sri Dorasami Naik, Superintendent Sri Mallikarjuna and others were present.
DONATION
Sri Majeti Munaiah, former General Manager, Odisha State Civil Supplies Corporation, Bhubaneswar along with his spouse Smt Venkata Padma has donated a Salagrama Haram to the deity on the auspicious occasion.
According to the Donor the sacred jewel weighed around 2.28kilos wrapped in around 670grams of silver. All the 54 Saligramas (holy stones believed to be non-anthropomorphic representation of Lord Vishnu) are the original and precious ones that were brought from banks of Kali Gandaki river at Muktinath in Nepal which are considered to be most auspicious.
Local Advisory Committee Chief Sri Dushmant Kumar, TTD officials were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భువనేశ్వర్ శ్రీవారి ఆలయంలో రెండవ రోజు కార్యక్రమ వివరాలు
– సాలగ్రామ హారం బహుకరణ
తిరుపతి, 2022 మే 22: భువనేశ్వర్‌లోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో రెండో రోజైన ఆదివారం నాడు విశేష పూజా కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి.
ఆదివారం ఉదయం కంకణ ధారణ, నవ కలశ స్నపనం, పంచగవ్య అధివాసం నిర్వహించారు. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి తొమ్మిది పాత్రల్లోని సుగంధ ద్రవ్యాలతో పుణ్యస్నానం చేశారు.
అనంతరం సాయంత్రం ఆగమ సలహాదారు డాక్టర్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు కలశ స్థాపన, అగ్నిప్రతిష్ఠ, ఉక్త హోమం నిర్వహిస్తారు.
డిప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్‌రెడ్డి, టీటీడీ హిందూ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ విజయసారధి, ఏఈవో శ్రీ దొరసామి నాయక్, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
విరాళం :
ఒడిశా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ మాజీ జనరల్ మేనేజర్, భువనేశ్వర్ కు చెందిన మాజేటి మునయ్య, శ్రీమతి వెంకట పద్మ దంపతులు స్వామి వారికి సాలగ్రామ హారం విరాళంగా అందించారు.
ఈ పవిత్ర ఆభరణం సుమారు 670 గ్రాముల వెండితో చుట్టబడి 2.28 కిలోల బరువు ఉంది. నేపాల్‌లోని ముక్తినాథ్ వద్ద కాళీ గండకీ నది ఒడ్డు నుండి తీసుకురాబడిన 54 అత్యంత పవిత్రమైన, శ్రేష్ఠమైన శాలిగ్రామాలతో తయారు చేయబడింది.
స్థానిక సలహా కమిటీ అధ్యక్షులు శ్రీ దుష్మంత్ కుమార్, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.