BIRRD TRUST MEETING HELD_ బర్డ్ ట్రస్టు సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
Tirupati, 8 October 2018: Sri Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled (BIRRD) Trust meeting was held under the Charimanship of TTD Trust Board Chief Sri P Sudhakar Yadav in Tirupati on Monday evening which has resolved to take some important decisions. Excerpts:
* Nod given to implement 7th PRC to the doctors working in BIRRD on the lines of SVIMS and NIMS where it is already implemented.
* Retirement age increased from 60years to 63years as per the GO which is already under implementation in SVIMS.
* The construction of 50 beds over the old hospital block need to be taken up immediately without further delay.
* Approved to go for open tender for the vacant room located in front of New Hospital Block. This would serve as Medical Shop for out patients. The monthly rentals obtained from this shop will be utilized for development of the hospital.
In the meeting which was held at Sri Padmavathi Rest House in Tirupati was also attended by members Sri Rayapati Samba Siva Rao, Sri Sandra Venkata Veeraiah, EO Sri Anil Kumar Singhal, FACAO Sri Balaji, Additional FACAO Sri Raviprasadudu, Director BIRRD Dr G Jagdeesh.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బర్డ్ ట్రస్టు సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
తిరుపతి, 2018 అక్టోబరు 08: టిటిడి బర్డ్ ట్రస్టు సమావేశం సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగింది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, అదనపు ఎఫ్‌ఏసిఏవో శ్రీ రవిప్రసాదుడు, బర్డ్ సంచాలకులు డా|| జగదీష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలు.
– బర్డ్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి 7వ పిఆర్‌సి వర్తింపచేసేందుకు నిర్ణయం.
– టిటిడి ఉద్యోగులు, రోగుల విజ్ఞప్తి మేరకు 50 ప్రత్యేక అదనపు గదులు నిర్మించేందుకు ఆమోదం.
– స్విమ్స్ తరహాలో జి.ఓ ప్రకారం వైద్యుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుండి 63 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
– బర్డ్ ఆసుపత్రిలో ఔట్‌పేషంట్లకు ఉపయోగకరంగా ఉండేలా కొత్త ఓపి బ్లాక్ ఎదురుగా గల గదిలో ఓపెన్ టెండర్ల ద్వారా మందుల దుకాణం ఏర్పాటు. ఈ దుకాణం అద్దె ద్వారా వచ్చే నెలసరి ఆదాయాన్ని బర్డ్ ఆసుపత్రి అభివృద్ధికి వినియోగం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.