BRAHMOTSAVAM SPECIAL STORY 2_ ANKURARPANAM MARKS THE CELESTIAL INVITATION_ అక్టోబరు 9న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirumala, 8 October 2018: One of the most significant events of the Navaratri Brahmotsavams at Srivari temple is the Ankurarpanam which trumpets the commencement of the nine day festival of religious grandeur and devotional gaiety.

This ritual which will be performed a day ahead of the Navarathri Brahmotsavam on October 9 and is often considered as prelude ritual seeking the successful conduct of the nine day mega religious event. The range of success is often compared with the sprouting of the nine varieties of multi grains ( Nava dhanyas ) sown on that day in the Yagashala of Srivari Temple. According to Chief Priest of Tirumala Sri Venugopala Dikshitulu, this event also invokes the blessings of Bhudevi with special prayers offering “Medini Puja” and inviting Her to participate in the event and also to bless the mankind with peace, prosperity, health and tranquility.

RELIGIOUS SIGNIFICANCE:

Ankurarpanam or Beejavapanam will be performed with religious fervour in Tirumala temple as per the tenets of Vaikhanasa Agama. Ankuram is “seed” and Arpanam is giving or to “Dedicate”. So Ankurarpanam means Sankalpam for performing or commitment to a specific purpose. The event is also marked with invitation to 49 gods and also asta dikpalakas, (Guardians of Directions in the universe) to participate in the event hosted for Lord Venkateswara by Lord Brahma.The dikpalakas includes Indra, Yama, Varuna, Vayu, Agni(fire), Kubera, Isana and Nirutti

NAVADHANYAS IMPLIES NAVA GRAHAS:

In the process of Ankurarpanam, nine grains or Nava Dhanyas are involved and Chandra is the lord for plants and grains. Chandra would be powerful during nights and hence Ankurarpanam is always performed during the night at an auspicious hour. The Nava Dhanyas signify the presence of each deity including – Rice,(Chandra) Wheat (Surya), Tur Dal (Khuja), Moong Dal (Budha), Red Peas (Bruhaspati), White Peas (Shukra) , Sesame (Shani) , Yellow Peas – (Rahu) and Horse Grams (Ketu).

AKSHATAROPANA ON FINAL DAY

The seeds are sown in mud pots called Palikas and they are placed at different directions in a geometrical manner as prescribed by Agamas. For nine days these seeds are grown and on the final day, the seedlings were separated from the sprouts and offered to the presiding deity and this process is called “Akshataropana”.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 9న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల, 2018 అక్టోబరు 08: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 9వ తేదీ మంగళవారం అంకురార్పణ జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

సేనాధిపతి ఉత్సవం ….

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.

మేదినిపూజ….

నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

అంకురార్పణ….

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

అక్షతారోపణ…

ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.