BLESSED TO BE IN THE PRANA PRATISTA CEREMONY OF AYODHYA RAM TEMPLE-  TTD CHAIRMAN _ త్రేతాయుగపు రాముడే మళ్లీ అయోధ్యకు దిగివచ్చినట్టుంది-⁠ ⁠టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

BLESSED TO BE IN THE PRANA PRATISTA CEREMONY OF AYODHYA RAM TEMPLE-  TTD CHAIRMAN

 

Tirumala, 22 January 2024: TTD Chairman Sri. Bhumana Karunakar Reddy expressed his happiness that he was blessed for having participated in the consecration ceremony of Ayodhya Ram Mandiram.

Taking part in the Prana Pratista of Ramlala held at Ayodhya on Monday, an overwhelmed Sri Karunakara Reddy expressed that

it was as if that same Sri Rama of Treta Yuga, came again after several centuries, after many anticipations, and stood there directly as Bala Rama.

Sharing his divine feeling, he said the prestigious ceremony has united all Hindus, imbuing all of us with humanitarian values ​​and giving a great philosophical message to change the world again and establish “Sri Rama Rajyam”, he asserted.

Adding further he said with the blessings of Sri Venkateswara Swamy,  he has been appointed as the TTD Trust Board Chairman with the assurance of the Chief Minister of Andhra Pradesh, Sri. YS Jagan Mohan Reddy.

Participating on the inauguration day of Ram Temple was a memorable event in my lifetime, he maintained.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

త్రేతాయుగపు రాముడే మళ్లీ అయోధ్యకు దిగివచ్చినట్టుంది..

•⁠ ⁠బాలరాముడే వచ్చి నిలబడ్డట్టుంది

•⁠ ⁠రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా జీవితకాల పుణ్యఫలం

•⁠ ⁠నా జన్మ ధన్యమైంది

•⁠ ⁠టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

తిరుమల, 22 జ‌న‌వ‌రి, 2024: త్రేతాయుగపు రాముడే అయోధ్యకు తిరిగి వచ్చినట్టుందని, రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని, తన జన్మ ధన్యమైందని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ కరుణాకరరెడ్డి సోమవారం అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఛైర్మన్ మాట్లాడుతూ తనకు కలిగిన దివ్యానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే….

ఆ భగవంతుడ్ని దర్శించుకోవడం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అందులోనూ ఈ రోజు తరతరాలుగా, ఓ కోరికగా మిగిలిన కల సాకారమైంది. ఒక విగ్రహ రూపంలో రాముడే అయోధ్యకు మళ్లీ దిగివచ్చినట్టుగా అనిపిస్తోంది. హిందువులందరినీ ఏకం చేసినట్లుగా, మనలో అంతా మానవతా విలువలు నింపి, ప్రపంచాన్ని మళ్లీ మార్చి, రామరాజ్యం తీసుకురావడానికి ఒక గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంది.

ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులందరినీ ఏకతాటిపై నడిపించినట్టుగా ఉంది. ఆ నడిపించిన తీరు కూడా, సమతాభావనతో, సమానత్వపు ఆలోచనలతో, మానవాళికి అంతా మంచి జరగాలనే తపన ఇందులో దాగి ఉంది. ఆ దిశగా భవిష్యత్తు ఉంటుందని, అలా సాకారం అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత సంఘటితమైన శక్తిగా ఒక రూపాన్ని తీసుకున్న అంశం రామాలయమే అనిపిస్తోంది. పూర్తి చేసుకున్న రామాలయంలో ఈ రోజున మొత్తం భారతదేశంలో ఉన్న రామ భక్తులు, ప్రపంచంలో ఉన్న హిందువులు అంతా ఒక్కటై… రామనామ జపాన్ని చేస్తూ, జగమంతా రామమయం అనే నినాదంతో ముందుకెళుతున్నారు. అందరికీ మంచి జరిగేలా, ఏ ఒక్కరికీ అన్యాయం, దోపిడీ లేకుండా, దోపిడీ రహిత రాజ్యాన్ని నిర్మించటానికి రామ మందిరం ఒక గొప్ప తాత్విక ఉద్దేశంగా మారుతుందన్న నమ్మకం నాకు కలిగింది.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి కరుణ, కృపా కటాక్షం వల్ల నేను ఆ స్వామి ఆలయ అధ్యక్షుడిగా నియమించబడడం, ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి ఆశీస్సుల వల్ల నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతినిధిగా రామాలయ ప్రారంభోత్సవ రోజున పాల్గొనటం నా జీవితకాల పుణ్యఫలం.

నా జీవితం ధన్యమైంది. ఒక గొప్ప సందేశాన్ని వినే అదృష్టం అదృశ్యరూపంలో నాకు కలిగిందని భావిస్తున్నాను.

ఆ రాముడే.. త్రేతాయుగపు రాముడే…కౌసల్య కడుపులో పుట్టిన ఆ రాముడే మళ్లీ అనేక సంవత్సరాల తర్వాత, అనేక ఎదురు చూపుల తరువాత, ఆయనే నేరుగా బాలరాముడై అక్కడికి వచ్చి నిలబడ్డట్టుగా ఉంది. అంతకంటే చెప్పాల్సిన మాటలు నా దగ్గర లేవు. జై శ్రీరామ్…

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.