GEAR UP FOR SANATANA DHARMIC SADAS- JEO _ తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలి- జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

* ALL DEPARTMENTS SHOULD COORDINATE EFFORTS

Tirupati, 22 January 2024: TTD JEO for Health and Education, Smt Sada Bhargavi directed officials to expedite arrangements for the Sanatana Dharmic conference to be held under the auspices of Hindu Dharma Prachara Parishad from February 3-5.

Addressing a review meeting at Sri Padmavati Rest House on Monday, the JEO instructed the HDPP officials to prepare invitations for pontiffs and Peethadhipatis and also a booklet on the Dharmic program of the conference to be held at the Asthana Mandapam in Tirumala for three days.

Among others she asked officials to organise liaison cum nodal officers for conducting the Dharmic sessions, srivari Darshan, transport and accommodation for all religious dignitaries.

VC of  SV Vedic University Acharya Rani Sadashiv Murthy, SVBC CEO Sri Shanmukh Kumar, HDPP Secretary Sri Somayajulu, Program officer Sri Rajagopal, Dasa Sahitya project special officer Sri PR Ananda Thirthacharyulu, Srinivasa Kalyanam project official Sri Chandrasekhar Reddy, DyEO Sri Govindarajan, GM(IT) Sri Sandeep and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

– అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో సదస్సు ఘ‌నంగా నిర్వ‌హించాలి

– జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుప‌తి, 2024 జ‌న‌వ‌రి 22: తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో సోమ‌వారం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన ప‌త్రిక‌లు, ధార్మిక కార్య‌క్ర‌మాల‌పై బుక్ లెట్ రూపొందించాలని డిపిపి అధికారులను ఆదేశించారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా స‌దుపాయాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిర్వ‌హించే ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై వీడియో రూపొందించాల‌ని ఎస్వీబీసి సిఈవోను ఆదేశించారు. స‌నాత‌న ధార్మిక సదస్సును ఘ‌నంగా నిర్వ‌హించేందుకు లైజ‌న్, నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించాల‌న్నారు.

అనంతరం సదస్సు నిర్వహణకు సంబంధించి చేయ‌వ‌ల‌సిన ఏర్పాట్ల‌ను విభాగాల వారిగా జేఈవో స‌మీక్షించారు.

ఈ సమావేశంలో వేద విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఎస్వీబీసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు, ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ పిఆర్ ఆనందతీర్థాచార్యులు, క‌ల్యాణం ప్రాజెక్టు అధికారి శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, జియం(ఐటి) శ్రీ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.