BLESSING HAND TO DESTITUTE- TTD EO _ అభాగ్యులకు ఆపన్నహస్తం : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 1 Jan. 22: Blessing hand of Sri Venkateswara will provide shelter, food and clothes to destitute of Tirupati who are suffering in chill cold or drenched in torrential rains.

 

 

TTD EO Dr KS Jawahar Reddy said it is a mandate of TTD to support the destitute of Tirupati and admit them to SV Balamandir or TTD Vrudhashram as per their age.

 

Reviewing the functioning of SV Sarva Shreya Trust and SV Vidya Dana trust at the Sri Padmavati rest house on Saturday the TTD EO directed officials to expand the services of Shravanam, Bala Mandir, Deaf and Dumb school, Karunadhaman and SV poor home and that of other institutions to more and more needy persons.

 

He said letters shall be sent to collectors of 13 districts to select parent less destitute and send them to TTD institutions for better care and upbringing.

 

He also advised officials to select suitable NGOs lime Ramakrishna Mission, Chinmaya Mission, ISKCON, Satya Sai Seva Samsthan etc. to supervise and caretaker the TTD institutions and imbibe discipline, moral standards and spiritual thinking for the future generations.

 

Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, FA& CAO Sri O Balaji, DEO Sri Govindarajan and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

అభాగ్యులకు ఆపన్నహస్తం : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుపతి, 2022, జనవరి 01: తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ దయనీయంగా కనిపిస్తున్న‌ అభాగ్యులందరినీ ఆదరించి వారి వ‌యసును బ‌ట్టి టిటిడి వృద్ధాశ్ర‌మంలో గానీ, ఎస్వీ బాలమందిరంలో గానీ చేర్పించ‌డం ద్వారా వారికి మెరుగైన జీవితాన్ని అందించిన వారమ‌వుతామ‌ని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఎస్వీ స‌ర్వ‌శ్రేయ ట్ర‌స్టు, ఎస్వీ విద్యాదాన ట్ర‌స్టుల‌పై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని శ్రవణం, బాలమందిరం, బ‌దిర పాఠశాల, క‌రుణాధామం, ఎస్వీ పూర్ హోమ్ తదితర సంస్థల్లో అందిస్తున్న సేవలను మరింత మందికి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తల్లిదండ్రులు లేని అనాథలైన పేద పిల్ల‌ల‌ను ఎంపిక చేసి పంపాల‌ని కోరాల‌ని, అలాంటివారిని ఎస్వీ బాలమందిరం, ఎస్వీ బ‌దిర పాఠశాల, శ్రవణం లాంటి సంస్థల్లో చేర్చుకుంటామ‌ని వివ‌రించారు. టిటిడిలోని ఎస్వీ బాలమందిరం, ఎస్వీ బ‌దిర పాఠశాల, శ్రవణం లాంటి సంస్థలను చ‌క్క‌గా నిర్వ‌హించేందుకు మంచి ఎన్‌జివో సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌న్నారు. ఇందుకోసం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు లేఖ రాసి చ‌క్క‌టి ఎన్జీవోను ఎంపిక చేయాల‌ని కోరారు. రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, ఇస్కాన్, సత్యసాయి సేవా సంస్థ లాంటి సంస్థ‌ల ద్వారా టిటిడి పాఠశాలలు, కళాశాలల‌ విద్యార్థులకు క్రమశిక్షణ, మానవీయ, నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన అల‌వ‌రిచి వారి భ‌విష్య‌త్తుకు చ‌క్క‌టి బాటలు వేయాలన్నారు.

ఈ సమీక్షలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, డిఇవో శ్రీ గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.