STRENGTHEN THE TTD BLOOD BANK-TIRUPATI JEO_ టిటిడిలో రక్తనిధిని మరింత పటిష్టం చేస్తాం : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 8 September 2017: There is need to strengthen its blood bank by taking up a massive publicity activity said, Tirupati JEO Sri P Bhaskar.

The JEO took part in the blood donation programme in Central Hospital of TTD at Tirupati on Friday. The drivers of Vishnusaradhi Society made blood donation. Speaking on this occasion, the JEO said there are 65 drivers in TTD Transport wing belonging to this society and among them 30 persons registered for blood donation. “It is indeed a good service is dearth of 80 lakh units of blood across the country and 10 lakh units across the state. “To overcome this, we can do our bit. There is need to bring awareness on the importance of blood donation. Enlighten our students studying in 34 educational institutions of TTD. Those who have completed Intermediate can do the blood donation”, he added.

Chief Medical Officer Dr Nageswara Rao, Transport GM Sri Sesha Reddy, Vishnusaradhi Society President Sri Appi Reddy, drivers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడిలో రక్తనిధిని మరింత పటిష్టం చేస్తాం : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

సెప్టెంబర్‌ 08, తిరుపతి, 2017 : టిటిడిలో రక్తనిధిని మరింత పటిష్టం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వర్‌రావును ఆదేశించారు. టిటిడిలోని రవాణా విభాగంలో పనిచేస్తున్న విష్ణుసారథి సొసైటీ డ్రైవర్లు శుక్రవారం ఉదయం టిటిడి కేంద్రీయ వైద్యశాలలో రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ టిటిడి రవాణా విభాగంలో విష్ణుసారథి సొసైటీ డ్రైవర్లు 65 మంది ఉన్నారని, వీరిలో 30 మంది రక్తదానం చేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన డ్రైవర్లను జెఈవో అభినందించారు. టిటిడిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, భక్తులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

దేశంలో ప్రతి ఏటా 80 లక్షల యూనిట్లకు పైగా రక్తం కొరత ఉందని, రాష్ట్రంలో 10 లక్షల యూనిట్ల కొరత ఉందని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడినట్లవుతుందని అన్నారు. టిటిడిలో పటిష్ట రక్తనిధి ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాలను పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. టిటిడిలో 34 విద్యాసంస్థలు ఉన్నాయని, ఇంటర్మీడియట్‌ నుంచి పై తరగతుల విద్యార్థులు రక్తదానం చేసేలా వారిలో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, వైద్యవిభాగం సిబ్బంది, విష్ణుసారథి సొసైటీ ప్రెసిడెంట్‌ శ్రీ కె.అప్పిరెడ్డి, ఇతర డ్రైవర్లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.