TTD TO PROMOTE AWARENESS ON VEDIC COURSES_ సెప్టెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు వైదిక సమ్మేళనాలు

Tirupati, 8 September 2017: The temple management of Tirumala Tirupati Devasthanams will take up an awareness programme to enlighten the students to take up vedic courses in its vedic varsity from September 9 to 15 at different places.

Tirupati JEO Sri P Bhaskar who is also currently acting as the VC of the varsity along with register Sri Vishwanatha and Co-ordinator Sri Brahmacharyulu will take up the awareness programme at Visakhapatnam on September 9, in Hyderabad on September 11, Vijayawada on September 12 and in Kadapa on September 15.

They will address on Adhunika Samajam – Vaidika Adhyayana Paddhatulu – the importance of vedic studies in the present day society during their awareness programme.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు వైదిక సమ్మేళనాలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అందిస్తున్న కోర్సులపై అవగాహన కల్పించి ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు వీలుగా సెప్టెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని 4 కేంద్రాల్లో వైదిక సమ్మేళనాలు జరుగనున్నాయి.

సెప్టెంబరు 9న విశాఖపట్నంలోని ద్వారకానగరలో గల శంకరమఠం, సెప్టెంబరు 11న హైదరాబాదులోని హిమాయత్‌ నగర్‌లో గల టిటిడి కల్యాణమండపం, సెప్టెంబరు 12న విజయవాడలోని టిటిడి కల్యాణమండపం, సెప్టెంబరు 15న కడపలోని శంకరాపురం మున్సిపల్‌ స్టేడియం ఎదురుగా ఉన్న టిటిడి కల్యాణ మండపంలో ఈ వైదిక సమ్మేళనాలు నిర్వహిస్తారు. వేద విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, రిజిస్ట్రార్‌ శ్రీపి.విశ్వనాథ, కో-ఆర్డినేటర్‌ శ్రీ బ్రహ్మాచార్యులు పాల్గొంటారు. ఆయా ప్రాంతాల్లోని వేద, ఆగమ, శాస్త్ర పండితులు, వేద పాఠశాలల విద్యార్థులు, ప్రజలు హాజరుకావాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.