BOARD MEET RESOLUTIONS_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
Tirumala, 8 January 2019: The TTD Trust board under the chairmanship of Sri P Sudhakar Yadav during its board meeting at Annamayya Bhavan in Tirumala took some important resolutions on Tuesday. Some excerpts:
• Nod to go for tenders to construct 384 rooms in Pilgrims Amenities Complex coming up at Alipiri at Rs.67.29crores
• Sanction of Rs.15.79crores in Second phase to install 1050 CCTVs in Tirumala
• Separate queue line to be constructed from Sarva Darshanam Complex to Alwar Tank Rest House at a cost of Rs.17.21crores
• Rs.2.63crores sanctioned for Smart Data Centre in Tirumala while Rs. I.97crores towards purchase of Hardware materials for new Data Centre in Tirupati.
• Tenders approved for Rs.27.29crores towards the construction of Maharajagopuram, Arjitha Seva, Addala, Vahana and Ratha mandapams and pushkarini at Sri Anjaneya Swamy temple in the Sri Venkateswara Divya Kshetram coming up at Amaravathi.
• Temple Archaka Sri Ananta Sayanam Dikshitulu posted in the place of late Sri Vedantam Desikacharyulu as Agama Advisor for a period of two years.
• The cost of rooms fixed in Sri Padmavathi Complex coming up at Tiruchanoor. Tariff details:
Non-A/C room-Rs.600
A/C room-Rs.1200
A/C dormitory per person-Rs.100
Non-A/C dormitory-Free
• Construction of Kalyana Mandapam at Appalayagunta at Rs.2.27crores
• Sanction of Rs.40.77crores towards the development of Gow Tourism, train dairy farmers, create awareness among students in dairy farming at Palamaner
• Sri Venkateswara Divyakshetrams coming at agency areas:
Parvathipuram in Vizianagaram-Rs.2.90crores
Seetampeta in Srikakulam-Rs.2.86crores
Rampachodavaram in East Godavari-Rs. 2.99crores.
TTD EO Sri Anil Kumar Singhal, Sri Dokka Jagannadham, Sri Bonda Umamaheswara Rao, Sri Challa Ramachandra Reddy, Smt Sudha Narayanamurthy, Smt Sapna Munagantiwar, Sri RudraRaju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Ex Officio Member, Sri Manmohan Singh, Dr M Padma, IAS, Spl Invitee Sri N Sri Krishna, Sri B Ashok Reddy, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.
ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
తిరుమల, 08 జనవరి 2019: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
– తిరుపతిలోని అలిపిరి వద్ద భక్తులకు వసతి కల్పించేందుకు మొదటి బ్లాకులో 384 గదులను రూ.67.29 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఖరారు.
– తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత పటిష్టంగా నిఘా, భద్రతను కల్పించేందుకు 2వ దశలో 1,050 సిసి కెమెరాలు ఏర్పాటుకు రూ.15.79 కోట్ల నిధులు మంజూరు.
– తిరుమలలో భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనం కాంప్లెక్స్ నుండి ఆళ్వార్ ట్యాంక్ రెస్ట్‌హౌస్ గేటు వరకు రూ.17.21 కోట్లతో క్యూలైన్ నిర్మించేందుకు టెండర్లు ఖరారు.
– తిరుమలలో స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.2.63 కోట్లు మంజూరు. అదేవిధంగా, తిరుపతిలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ ఏర్పాటుకు రూ.1.97 కోట్లు మంజూరు.
– అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా మహారాజగోపురం, ఆర్జితసేవామండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథమండపం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, పుష్కరిణి నిర్మించేందుకు రూ.27.29 కోట్లతో టెండర్లు ఖరారు.
– స్వర్గీయ వేదాంతం దేశికాచార్యులు స్థానంలో టిటిడి అర్చకులు శ్రీ ఎ.అనంతశయన దీక్షితులను రెండేళ్ల కాలపరిమితికి గాను ఆగమసలహాదారుగా నియమించేందుకు ఆమోదం.
– తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న వసతి సముదాయంలో ఒకరోజుకు నాన్ ఏసీ గది రూ.600/-, ఏసీ గది రూ.1200/-, ఏసీ డార్మిటరీ ఒక వ్యక్తికి రూ.100/- అద్దె, నాన్ ఏసీ డార్మిటరీ ఉచితంగా కేటాయించేందుకు ఆమోదం.
– పలమనేరులోని గోశాలలో దేశవాళి గోవుల సంరక్షణ కోసం, ”గోపర్యాటకాన్ని” అభివృద్ధి చేసేందుకు, పాడిరైతులకు శిక్షణ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.40.77 కోట్లు మంజూరుకు ఆమోదం.
– అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద కల్యాణమండపాన్ని రూ.2.27 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఖరారు.
– ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రాల నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
విజయనగరం జిల్లా పార్వతీపురంలో రూ.2.90 కోట్లు
శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో రూ.2.86 కోట్లు
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రూ.2.99 కోట్లు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.