PUJA FOR SRI VENKATESWARA DIVYAKSHETRAM IN AMARAVATHI ON JAN 31 – EO_ జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ : టిటిడి ఈవో

Tirumala, 8 January 2019: The construction of Sri Venkateswara Divyakshetram at Amaravathi will be commenced after performing Bhoomakarshana Puja on January 31.

Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala after board meeting on Tuesday, the EO said, the muhurtam has been fixed for the puja as per Vaikhanasa Agama between 9.10am and 9.40am by agama scholars.

He said, the Honourable Chief Minister Sri N Chandrababu Naidu will take part in this puja.

The EO also said, the board has agreed to pay ordinary bus fares to the bhajan artistes of Akhanda Hari Nama Sankeertana at Tirumala.

He said, a sub committee under the chairmanship of Sri P Sudhakar Yadav has been constituted which will submit a report on observations over shops of Tirumala and hawkers licence in ten days span.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI

జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ : టిటిడి ఈవో

తిరుమల, 08 జనవరి 2019: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ జనవరి 31వ తేదీన ఉదయం 9.10 నుండి 9.40 గంటల మధ్య అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆగమోక్తంగా భూకర్షణ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీనారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని వెల్లడించారు. టిటిడి తిరుమలలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తనకు వచ్చే భజన బృందాలకు ఆర్డినరీ బస్‌ చార్జీలు చెల్లించనున్నట్టు తెలిపారు. తిరుమలలో దుకాణాలు, హాకర్ల లైసెన్సుల సమస్యలపై టిటిడి ఛైర్మన్‌ అధ్యక్షతన సబ్‌ కమిటీ ఏర్పాటుచేశామని, ఇందులో బోర్డు సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీ విజయసారధి సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ కమిటీ రానున్న 10 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని, కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీబోండా ఉమామహేశ్వరరావు, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీచల్లా రామచంద్రారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీఎన్‌.శ్రీకృష్ణ, శ్రీ అశోక్‌రెడ్డి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.