SMT Y.V.ANURADHA SWORN IN AS TTD BOARD EX-OFFICIO_ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి వై.వి.అనురాధ ప్రమాణస్వీకారం

TIRUMALA, 14 May 2015: The 1993-Batch IAS Officer, Smt Y.V.Anuradha, the Endowment Commissioner, Govt. of AP, sworn in as the ex-officio member of TTD Trust Board on Monday.

The TTD Joint Executive officer Sri K.S. Sreenivasa Raju administered the oath of office to Smt YV Anuradha at the Bangaru Vakili of Tirumala temple on Monday morning. After fulfilling the formalities, Smt Y.V.Anuradha offered prayers to Lord Venkateswara. Later the vedic pundits offered Veda Asirvachanams inside Ranganayakula Mandapam.

Speaking on the ocassion Smt Anuradha said this was her third nomination to the TTD board and that she woud strive to serve the devotees and utilise the god given opportunity well.

DyEO Sri Malleswari, Peishkar Sri Ramesh and other officials were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా దేవాదాయ శాఖ కమిషనర్శ్రీ మతి వై.వి.అనురాధ ప్రమాణస్వీకారం

మే 7,  తిరుమల 2018: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి వై.వి.అనురాధ సోమవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉదయం 10.40 గంటలకు శ్రీమతి వై.వి.అనురాధతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి వై.వి.అనురాధకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు.

ఈ సందర్భంగా శ్రీమతి వై.వి.అనురాధ మీడియాతో మాట్లాడుతూ టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా మూడోసారి ప్రమాణం చేశానని , భక్తులకు మరింత మెరుగైన సేవలందిస్తామని అన్నారు. ఈ అవకాశం తనకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి , బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి. సి.మల్లీశ్వరి దేవి , ఏఈవో శ్రీ రమేష్ బాబు, ఏవీఎస్వో శ్రీ కూర్మారావు , సూపరింటెండెంట్ శ్రీమతి ఎ.మల్లీశ్వరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.