MAY 11 TO 15 BTU OF SRI CHANDRAMOULESWARA SWAMY TEMPLE IN RISHIKESH_ మే 11 నుండి 15వ తేదీ వరకు రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 7 May 2018: The annual Brahmotsavam of Sri Chandramouleswara Temple, Rishkesh will commence from May 11-15 for which Ankurarpanam and Mushika vahanam will be performed on May 10.

TTD will conduct Dwajarohanam and several vahanam sevas on all the days specially Vrushabha Vahanam (May 4) and Ravanasura Vahanam (May 15).

During the six day long event the artisans of HDPP, Annamacharya Project, and Dasa Sahitya project will perform bhakti sangeet, cultural programs, bhajans, kolatas etc to enthrall the devotees spiritually.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 11 నుండి 15వ తేదీ వరకు రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 07, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణం, మూషిక వాహనసేవ నిర్వహిస్తారు.

తేదీ ఉదయం సాయంత్రం

11-05-18(శుక్రవారం) ధ్వజారోహణం, కల్పవృక్షవాహనం హంస వాహనం

12-05-18(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

13-05-18(ఆదివారం) శేషవాహనం గజవాహనం

14-05-18(సోమవారం) సింహవాహనం కల్యాణోత్సవం, వృషభవాహనం

15-05-18(మంగళవారం) త్రిశూలస్నానం, తిరుచ్చి ధ్వజావరోహణం, రావణాసుర వాహనం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.