BOOK RELEASES @ CHINNASESHA VAHANAM_ చిన్నశేష వాహ‌న‌సేవ‌లో ఆధ్యాత్మిక పుస్త‌కాలు ఆవిష్క‌ర‌ణ‌

Tirumala, 11 October 2018: The Navaratri Brahmotsavam vahana sevas on mada street have emerged as a prestigious platform for release of unique publications of the TTD including books and CDs.

On day-2 of the Navaratri Brahmotsavam, the TTD Executive Officer Sri Anil Kumar Singhal at the procession of Chinna Sesha Vahanam on Mada streets released the compilation o five religious compilations published by the TTD.

He released a book on ‘Itihasa Kalamlo Manava sambandhalu’ scripted by Chivukula Ramakanth Sharma on the theme of human relations as preached by Maharshis, Pontiffs and Bhagavathars.

The second book released by him was the ‘ Garudopakhayanam penned by Dr Divakarla Venkatavdhani on the theme of Mahabharata with a foreword by Dr Muvva Vrushadhipathi.

The EO also released a publication in the Bharata Upakhyana Grantha mala series on ‘Brahmana geetalu’ written by Dr HN Brahmananda on the theme of Sri Krishna’s preachings to Arjuna during the Aswamedha in Mahabharata

Sri Singhal released a book on Pavitrokhyanam, authored by Dr Nanduri Ramakrishna charya on the theme of Maharshi Markandeyas preaching to Dharma Raju with a foreword by Dr Malayavasini.

Finally the TTD EO released the book titled Usha Kalyanam written by Dr KJ Krishnamurthy, coordinator of the Tarigonda Vengamamba project on the theme of Tallapaka Chinatiruvengadanathudu grandson of Tallapaka Annamacharyas.

Dr Anjaneyulu, OSD of the TTD Publications and sub editor Dr Narasimhacharya along with other officials participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చిన్నశేష వాహ‌న‌సేవ‌లో ఆధ్యాత్మిక పుస్త‌కాలు ఆవిష్క‌ర‌ణ‌

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల 2వ రోజు గురువారం ఉదయం స్వామివారు మురళీకృష్ణ అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా 5 ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆవిష్క‌రించారు.

ఇతిహాసకాలంలో మానవసంబంధాలు పుస్త‌కాన్ని శ్రీ చివుకుల రమాకాంతశర్మ ర‌చించారు. ఇందులో మానవసంబంధాలు ఎలా ఉండాలి, ఎలాంటివారితో స్నేహం పెంచుకోవాలి తదితర విషయాలను మహర్షులు, పీఠాధిపతులు, ప్రవచనకారులు ఎందరో తమ ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ధార్మిక సందేశాల ద్వారా హితబోధ చేసిన అంశాలను క్రోడీకరించారు. మహాభారత ఆది పర్వంలోని గరుడోపాఖ్యానం (భారత ఉపాఖ్యాన గ్రంథమాల) అనే కథాంశానికి డా.దివాకర్ల వేంకటావధాని వ్యాఖ్యానాన్ని అందించగా డా.మొవ్వ వృషాద్రిపతి పీఠికను సంతరించారు. అలాగే మహాభారత అశ్వమేథ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన బ్రాహ్మణగీతలు( భారత ఉపాఖ్యాన గ్రంథమాల) అనే ఈ కథాంశానికి డా.హెచ్.ఎస్. బ్రహ్మానంద వ్యాఖ్యానాన్ని అందించగా డా. సముద్రాల లక్ష్మణయ్య పీఠికను సంతరించారు.

మహాభారత ఆరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పిన సావిత్ర్యుపాఖ్యానం ( భారత ఉపాఖ్యాన గ్రంథమాల) అనే కథాంశానికి డా. నండూరి రామకృష్ణమాచార్య వ్యాఖ్యానాన్ని అందించగా డా. కె.మలయవాసినిగారు పీఠికను సంతరించారు. తాళ్ళపాక చిన్నన్న రచించిన ఉషాకల్యాణము గ్రంథాన్ని తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ సమన్వయకర్త డా. కె.జె. కృష్ణమూర్తి పరిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. ఆంజ‌నేయులు, ఉప‌సంపాద‌కులు డా.న‌ర‌సింహాచార్య తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.