AYUR EXPO FOCUSES ON ANCIENT VAIDYA_ భక్తులకు ఆయుర్వేద వైద్యం – డా. యు. పార్వతిదేవి

Tirumala, 11 October 2018: TTD has rolled out an extensive program to popularize the use of Ayurveda medicine and also produce them in the SV forests for optimum utilization of the devotees which was showcased in Exhibition.

Speaking at the Media center in Ram Bhagicha -2 Dr M Parvati Devi, Principal of TTD Ayurveda College and Superintendent of Hospital said that the Ayurveda Pharmacy and Ayurveda College have displayed their unique activity at the Mega Exhibition.

She said visiting devotees were apprised of the Ayurveda practices, which are available in TTD. She said, the medicinal plants, products and practices are in vogue to preserve and sustain the ancient legacy.

Ayurveda camp and dispensary is set up near Lepakshi and CRO office at Tirumala with medicine for nearly 40 ailments. She said, Doctors of different streams and para medical staff were also available from morning 9am to 7pm to serve the devotees.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులకు ఆయుర్వేద వైద్యం – డా. యు. పార్వతిదేవి

అక్టోబ‌రు 11, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ కలసి సంయుక్తంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల సూపరింటెండెంట్ డా. పార్వతిదేవి తెలిపారు. కల్యాణవేదికలో ఆయుర్వేద కళాశాల మరియు ఆయుర్వేద ఫార్మసీ కలసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు.

ఇందులో ఆయుర్వేద వైద్యవిధానాలు, మందు మొక్కలు, ఆయుర్వేద మందులు ఉంచి వాటి గురించి భక్తులకు వివరిస్తున్నామని చెప్పారు. తిరుమలలో సీఆర్వో ఆఫీస్, లేపాక్షి పక్కన డిస్పెన్సరీలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. వైద్య శిబిరాలలో వివిధ శాఖల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. కీళ్ల నొప్పులు, శ్వాశామృతంతో పాటు 40 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రతిరోజు ఉదయం 9 గం.ల నుండి రాత్రి 7 గంటల వరకు భక్తులకు సేవలు అందిస్తున్న‌ట్ట తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.