BRAHMOTAVAMS TO BE OBSERVED IN A MEMORABLE WAY-TTD EO_ చిరస్మరణీయంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ALL WORKS TO BE COMPLETED IN NEXT COUPLE OF WEEKS

WE WILL CO-OPERATE WITH TTD FOR THE MEGA EVENT-COLLECTOR

Tirumala, 21 Aug,2017: The ensuing annual mega religious event of Srivari Navahnika Brahmotsavams will be going to be observed in a historical way this year and all the arrangements for the same are underway, asserted TTD EO Sri Anilkumar Singhal.

A high-level review meeting on the arrangements of the big religious event was held at Annamaiah Bhavan in Tirumala on Monday by TTD EO along with District Collector Sri Pradyumna, other district authorities, TTD officials, district police and TTD vigilance. Tirumala JEO Sri KS Sreenivasa Raju

After discussing in length over the ongoing arrangements with various department heads in TTD, the EO elaborated on some important arrangements in to the media during the press conference. Some excerpts of the meeting.

* Annual Brahmotavams from September 23 to October 1 with Garuda Seva on September 27.
* Honourable Chief Minister of Andhra Pradesh Sri N Chandra Babu Naidu to present silk vastrams to Lord Venkateswara on first day of annual brahmotsavams on behalf of State Government
* Every day the procession of vahanams takes place between 9am and 11am in the morning and 9pm and 11pm in the evening except for the Garuda Seva which commenced by 7:30pm and lasts till 1am.
* All the civil and electrical works for the big event will be completed in next couple of weeks.
* Deployment of additional staff, allocation of duties by concerned departments completed for both religious and non-religious staff well in advance for each vahanams.
* Separate entry and exit gates to avoid criss-cross movements planned
* About Rs.8crores sanctioned to carryout various developmental works for the annual fete
* New Sarva Bhupala Vahanam gets ready for the brahmotsavams
* Separate parking identified in Tirupati also for Garuda Seva. Two-wheelers restricted to ply on ghat roads on Garuda Seva day.
* Additional ambulances, medical staff, doctors, auto mobile clinic vehicles in eight points on ghat roads deployed to meet any exigencies
* Security set up beefed up. About 600 CC cameras with advanced technology to be erected at vital points during annual brahmotavams on permanent basis
* Fire Extinguishers also kept ready
* Six lakh water sachets to be distributed on Garuda Seva day in galleries and annaprasadam to be supplied from 12noon itself for the pilgrims waiting in galleries.
* Apart from police and TTD Vigilance and Security, over 3000 Srivari Sevakulu have been deputed for the big fete.
* APSRTC to operate 4000 trips with 550 buses for Garuda Seva has been planned.
* VIP Break Darshan restricted to only protocol VIPs during brahmotsavams. Adavanced reservation of accommodation is also cancelled during the nine-day fest.

Later District Collector assured that the district administration will extend complete co-operation to the TTD management for the successful conduct of this mega religious event.

Earlier Tirumala JEO Sri KS Sreenivasa Raju briefed the officials about the gallery entry-exit model through detailed power point presentation. Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, ASP Tirumala Sri Murali Krishna and all top brass officials from TTD and district administration were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చిరస్మరణీయంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

బ్రహ్మూెత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుమల, 21 ఆగస్టు 2017 : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మూెత్సవాలను చిరస్మరణీయంగా నిర్వహిస్తామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సోమవారం జిల్లా కలెక్టర్‌ శ్రీపిఎస్‌.ప్రద్యుమ్న, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి ఈవో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియా సమావేశంలో సెప్టెంబరు 23 నుండి అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల గోడపత్రికలను ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీపిఎస్‌.ప్రద్యుమ్న, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ శ్రీ మురళీకృష్ణ, ఆలయ ప్రధానార్చకులు డా|| ఎ.వి.రమణదీక్షితులు, శ్రీనరసింహదీక్షితులు కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మూెత్సవాల కోసం అన్ని విభాగాలు ఎలాంటి రాజీకి తావులేకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. సెప్టెంబరు 23న ధ్వజారోహణం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ||శ్రీ నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్ల కోసం ఇప్పటివరకు రూ.8 కోట్లు కేటాయించామని, దశలవారీగా ప్రణాళికాబద్ధంగా ఈ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

గరుడసేవనాడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనుమ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేశామని ఈవో తెలిపారు. తిరుమలతోపాటు తిరుపతిలోనూ కార్ల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేపట్టామన్నారు. బందోబస్తు, గ్యాలరీల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర ద్వారాలు, అన్నప్రసాదాలు, జలప్రసాదం, రవాణా, వైద్య సౌకర్యాలు, అదనపు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశామని వివరించారు. గరుడసేవనాడు 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామని, అదనంగా వైద్యసిబ్బంది, అంబులెన్సులు ఏర్పాటుచేస్తామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశద్వారాల వద్ద భక్తుల తోపులాట లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం పెయింటింగ్‌, విద్యుత్‌ అలంకరణ పనులు, మరమ్మతులు తదితర పనులు జరుగుతున్నాయని తెలిపారు. గరుడసేవ నాడు 550 ఆర్‌టిసి బస్సులు 4 వేల ట్రిప్పులు తిరిగి భక్తులను చేరవేస్తాయన్నారు.

బ్రహ్మూెత్సవాల కోసం జిల్లాలోని ఫైర్‌, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి తగినంతమంది సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించుకుంటామని ఈవో తెలిపారు. బ్రహ్మూెత్సవాల కోసం 600 సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తామని, సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌, వీడియోవాల్స్‌ తదితర భద్రతా ఏర్పాట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. 3 వేల మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామన్నారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు, తనిఖీలు జరిగాయన్నారు.

జిల్లా కలెక్టర్‌ శ్రీ పిఎస్‌.ప్రద్యుమ్న మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు జిల్లా యంత్రాంగం తరఫున కావాల్సిన సహకారం తప్పక అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన రోజు భద్రత, ప్రోటోకాల్‌ ఏర్పాట్లు చేపడతామన్నారు. తిరుపతిలో భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్‌, తాగునీరు, రవాణా, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేస్తామన్నారు.

అంతకుముందు అధికారుల సమావేశంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన, గరుడసేవ, చక్రస్నానం, వాహనసేవలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఎల్‌ఇడి తెరలు, మాడ వీధుల్లోకి భక్తుల ప్రవేశం, గ్యాలరీలు తదితర అంశాలను వివరించారు.

ఈ సమావేశంలో ఆర్‌టిసి ఆర్‌ఎం శ్రీ నాగశివుడు, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ నరసింహారావు, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఇతర టిటిడి, పోలీసు, జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.