ANANTAVARAM ANNUAL BRAHMOTSAVAMS FROM MARCH 19 TO 22_ మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 18 Mar. 19: The annual brahmotsavams in Sri Venkateswara Swamy temple at Anantavaram will be observed from March 19 to 22 by TTD.
The important days includes Shanti Kalyana Mahotsavam on March 20, Garuda Seva on 21 and Pushpa Yagam on March 22.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మార్చి 18, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
మార్చి 19వ తేదీ ఉదయం 9 గంటలకు మేష లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 20న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు. మార్చి 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వసంతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి, రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా మార్చి 22న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజూ ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కాగా, ఈ ఆలయంలో మార్చి 23, 30వ తేదీల్లో ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.