DHWAJAROHANAM MARKS THE BEGINNING OF BTU _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 31 MAY 2023: The celestial Dhwajarohanam event marked the beginning of the annual Brahmotsavams in Appalayagunta on Wednesday.

In the auspicious Mithuna Lagnam between 7:00am and 7:30am the holy event took place.

Later Snapana Tirumanjanam was observed between 8:30am and 9:30am while Unjal Seva will be performed in the evening.

DyEO Sri Govindarajan, AEO Sri Prabhakar Reddy and other officials are present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 మే 31: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7 నుండి 7.30 గంటల వ‌ర‌కు మిధున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

అంతకుముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి నిర్వహించారు. మిధున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.

ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. అనంతరం కంకణభట్టార్‌ శ్రీ తిప్పయ్యచార్యులు ఆధ్వర్యంలో ఆస్థానం జరిగింది.

అనంతరం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగుతుంది . రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహన సేవ వైభవంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శివ‌కుమార్‌, పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.