NARAYANAVANAM BTUs OFF TO A RELIGIOUS START _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 31 MAY 2023: The celestial Dhwajarohanam event marked the beginning of the annual Brahmotsavams in Narayanavanam on Wednesday.

 

In the auspicious Mithuna Lagnam between 6:30am and 7:30am the holy event took place in this ancient Sri Padmavathi sameta Sri Kalyana Venkateswara Swamy temple.

 

Later Snapana Tirumanjanam was observed between 10am and 11am while Unjal Seva will be performed in the evening.

 

DyEO Smt Nagaratna, AEO Sri Mohan and other officials are present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 మే 31: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.

సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం తో అభిషేకం చేశారు.

రాత్రి 7 గంటల నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ ఏకాంబరం, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ నాగ‌రాజు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.