BRAHMOTSAVAMS BEGINS AT THALLAPAKA TEMPLES _ తాళ్ళపాక శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirupati, 20 July 2021: The annual Brahmotsavams at TTD temples in Tallapaka at YSR Kadapa district commenced on a grand religious note with the Dwajarohanam ritual in Ekantham due to Covid norms.
At Sri Chenna Keshava Swamy and in Sri Siddeswara Swamy temples at Tallapaka in Rajampeta Mandal the annual Brahmotsavam festivities will last upto from July 28.
All the vahana sevas and all other rituals will be held in Ekantha inside the temple.
Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkatesh, temple inspector Sri Anil Kumar were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తాళ్ళపాక శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 జూలై 20: కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 20 నుండి జూలై 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ఈ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ రెండు అలయాల్లో వేరువేరుగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవలు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమాల్లో ఏఈవో శ్రీ మురళిధర్, సూపరింటెండెంట్ శ్రీ వేంకటేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.