BRAHMOTSAVAMS IN PEETHAPURAM FROM MARCH 22 TO 28 _ పిఠాపురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
పిఠాపురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, మార్చి 16, 2013: తితిదేకి అనుబంధంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల పోస్టర్లను తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెఈవో మాట్లాడుతూ మార్చి 23 నుండి 28వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్చి 22వ తేదీన అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మార్చి 28వ తేదీ సాయంత్రం పుష్పయాగం కన్నులపండువగా జరుగనుందని ఆయన వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అదనపు ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి శ్రీ బాలాజి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ బాలాజి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.