BRINGING NEW SANKEERTANS WITH NEW TALENTS TO PUBLIC FORE IS THE AIM OF “ADIVO ALLDIVO” -ADDITIONAL EO _ యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లను చేరువ చేసేందుకే పోటీలు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUPATI, 06 DECEMBER 2021: Saint poet Sri Tallapaka Annamacharya Sankeertans are popular across the world and the aim of “Adivo Alladivo” program is to bring new Sankeertans of Annamacharya which were composed by TTD with new talents to the public fore, said TTD Additional EO Sri AV Dharma Reddy.

The curtain raiser and inaugural session of the unique “Adivo Alladivo” program took place at Mahati Auditorium in Tirupati on Monday. Speaking on the occasion, the Additional EO said so far TTD has recorded 4000 Sankeertans of Annamaiah. But only a few are in popularity. “So we have designed this program. On the other hand, we are also bringing out book with “Artha Tatparya” for each kriti of Annamacharya soon”, he added.

Earlier the Chairman SVBC Dr Saikrishna Yachendra in his presidential remarks said the program is the brainchild of TTD EO Dr KS Jawahar Reddy and the main aim is to promote the new compositions of Annamaiah as well the new talented youth. The competitions are being held to the age groups between 15-25years.

“From the past six centuries the entire clan of Annamacharya has been doing service to Sri Venkateswara Swamy with their Sangeeta and Sahitya. Even today we can see the rendition of the descendants of Annamacharya in Tirumala temple”, he maintained.

Later Vice-Chancellor of SV Vedic University Prof Sannidhanam Sudarshana Sharma said Sangeetham is also a Upavedam as it is often considered as a sub wing of Sama Veda.

In the Sangeeta Sahitya world Annamaiah will be in the forefront and described him as “Telugu Bhartruhari”.

National Sanskrit University Vice-Chancellor Prof. Muralidhara Sharma in his address said their varsity will support TTD in this divine endeavour. He also suggested that the new talents be provided a platform on Nadaneerajanam.

Annamacharya Project Director Dr A Vibhishana Sharma said “Like Dasavataras of Sri Maha Vishnu, Dasa Sahiti Lakshanas were there in Annamaiah kritis. On a war-footing, this program has been designed and to encourage youth on the new compositions of Annamaiah. By next Ugadi we will bring out all the Adhyatma Keertans compiled with 17 pundits to the public domain”, he added.

Later a video promo on the programme with a background score rendered by Madhu Balakrishna was displayed on the occasion followed by the felicitation to all dignitaries.

Veteran singer of Annamacharya Project Dr G Balakrishna Prasad rendered “Ani Anatiche Krishnudarjununito”. Senior retired artistes Dr P Ranganath, Sri Ananda Bhattar, renowned playback singer Smt SP Sailaja, CAO Sri Sesha Sailendra, CEO SVBC Sri Suresh Kumar, DFO Sri Srinivasulu Reddy, PRO Dr T Ravi were also present.

The singing competitions by the participants commenced after the inaugural programme.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లను చేరువ చేసేందుకే పోటీలు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

న్యాయ‌నిర్ణేత‌లుగా ప్ర‌ముఖ గాయ‌ని శ్రీ‌మ‌తి ఎస్‌పి.శైల‌జ‌, టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌

ఎస్వీబీసీలో అదివో.. అల్ల‌దివో.. కార్య‌క్ర‌మం ప్రారంభం

తిరుపతి, 2021 డిసెంబ‌రు 06: శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వైభ‌వాన్ని, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల్లోని భ‌క్తిభావ‌న‌ను జ‌న‌బాహుళ్యంలో విస్తృత‌ప్ర‌చారం క‌ల్పించ‌డంతోపాటు యువ‌త‌కు చేరువ చేసేందుకే పోటీలు నిర్వ‌హిస్తున్నామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో అదివో.. అల్ల‌దివో.. పేరుతో పాట‌ల పోటీల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శీర్షికా గీతాన్ని ఆవిష్క‌రించి ప్ర‌ద‌ర్శించారు.

ఈ కార్యక్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు 4 వేల సంకీర్త‌న‌లను రికార్డు చేసి టిటిడి వెబ్‌సైట్‌లో పొందుప‌రిచామ‌ని తెలిపారు. అయితే వీటిలో కొన్ని సంకీర్త‌న‌లు మాత్ర‌మే బ‌హుళ ప్ర‌జాద‌ర‌ణ పొందాయ‌ని, మిగిలిన సంకీర్త‌న‌ల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించామ‌ని వివ‌రించారు. ఇందుకోసం సుమారు 50 ఎపిసోడ్ల‌తో అదివో.. అల్ల‌దివో.. కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. అన్నమాచార్య సంకీర్తనలపై లోతైన విశ్లేషణ చేసి ప్ర‌తిప‌దార్థాలు, అర్థతాత్పర్యాలు, విశేషాంశాల‌తో భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి జ‌రుగుతోంద‌ని తెలిపారు.

ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సంక‌ల్పం, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రోత్సాహంతో కొత్త‌, పాత సంకీర్త‌న‌ల మేలు క‌ల‌యిక‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. ఇందులో 15 నుండి 25 సంవ‌త్స‌రాల యువ‌తీ యువ‌కులు పాల్గొంటార‌ని చెప్పారు. అన్న‌మ‌య్య‌, పెద తిరుమ‌ల‌య్య‌, చిన తిరుమ‌ల‌య్య కుటుంబమంతా సంగీత‌, సాహిత్య సేవ‌లో త‌రించార‌ని తెలిపారు.

టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ 600 సంవ‌త్స‌రాల పూర్వం అన్న‌మ‌య్య త‌న సంకీర్త‌న‌లు ర‌చించార‌ని, అప్ప‌టినుండి 150 ఏళ్ల వ‌ర‌కు శిష్య‌ప‌రంప‌ర‌, కుటుంబ స‌భ్యుల ద్వారా ప్ర‌చారం పొందాయ‌ని,  ఆ త‌రువాత క‌నుమ‌రుగ‌య్యాయ‌ని చెప్పారు. సుమారు వంద సంవ‌త్స‌రాల క్రితం అన్న‌మ‌య్య సాహిత్యంపై టిటిడి దృష్టి సారించింద‌ని, ఆ త‌రువాత అప్ప‌టి ఈవో శ్రీ పివిఆర్‌కె.ప్ర‌సాద్ హ‌యాంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు ప్రారంభ‌మైంద‌ని వివ‌రించారు. శ్రీ రాళ్ల‌ప‌ల్లి అనంత‌కృష్ణ‌శ‌ర్మ‌, శ్రీ ప‌శుప‌తి, శ్రీ జాన‌కీరామ‌న్‌, శ్రీ నేదునూరి కృష్ణ‌మూర్తి లాంటి ప్ర‌సిద్ధ సంగీత‌కారులు బాణీలు క‌ట్టార‌ని, శ్రీ బాల‌ముర‌ళీకృష్ణ‌, శ్రీ‌మ‌తి వింజ‌మూరి ల‌క్ష్మి లాంటి సుప్ర‌సిద్ధ గాయ‌కులు ఆకాశ‌వాణిలో పాడ‌డం ద్వారా విస్తృత ప్ర‌చారం ల‌భించిందని తెలియ‌జేశారు. యువ‌త‌ను ఆక‌ర్షించి సంకీర్త‌న‌ల వైపు మ‌ర‌ల్చి ప్ర‌చారం చేయ‌డం ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశ‌మన్నారు.

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ మాట్లాడుతూ సంగీతాన్ని గాంధ‌ర్వ వేదం అంటార‌ని, ఇది సామ‌వేదానికి ఉప‌వేద‌మ‌ని తెలిపారు. సామ వేదంలోని 21 స్వ‌రాల్లో 7 స్వ‌రాల‌తో సంగీతం ఉద్భ‌వించింద‌న్నారు. తెలుగు సాహితీ సామ్రాజ్యంలో అన్న‌మ‌య్య ముందు వ‌రుస‌లో ఉంటార‌ని వివ‌రించారు.

జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉపకుల‌ప‌తి ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ సంగీతానికి భ‌క్తిని జోడించ‌డం స‌నాత‌న ధ‌ర్మం గొప్ప‌ద‌న‌మ‌న్నారు. ఈ పోటీల వ‌ల్ల యువ‌త ఉద్యోగాన్వేష‌ణ‌కే ప‌రిమితం కాకుండా సంగీతంలో అభినివేశం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఈ పోటీల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి నాద‌నీరాజ‌నం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని, తద్వారా మ‌రింత మంది కొత్త క‌ళాకారులు త‌యార‌వుతార‌ని వివ‌రించారు.
 
అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ మాట్లాడుతూ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించేందుకు వీలుగా ఒక వైపు సంకీర్త‌న‌ల ప‌రిష్క‌ర‌ణ‌, మరోవైపు రికార్డింగ్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసేందుకు వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథాన్ని ప్ర‌చారంలోకి తీసుకురావాల‌న్నారు. సంకీర్త‌న‌ల‌కు అర్థ‌తాత్ప‌ర్యాలు, విశేషాంశాలు రాసే ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంద‌ని, ఉగాది నాటికి అధ్యాత్మ సంకీర్త‌న‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు.

అదేవిధంగా, ప్ర‌ముఖ సంగీత క‌ళాకారులు శ్రీ పారుప‌ల్లి రంగ‌నాథ్‌, శ్రీ వేదవ్యాస ఆనంద‌భ‌ట్ట‌ర్ మాట్లాడుతూ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆల‌పించ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌న్నారు. యువ క‌ళాకారులు వీటిని ఆల‌పించి, ఆస్వాదించి, ప్ర‌చారం చేయాల‌ని కోరారు.

అనంత‌రం పాటల పోటీల కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. మొద‌టిరోజు 12 మంది యువతీ యువ‌కులు ప‌లు సంకీర్త‌న‌లు ఆల‌పించి పోటీల్లో పాల్గొన్నారు. శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌, ప్ర‌ముఖ నేప‌థ్య‌గాయ‌ని శ్రీ‌మ‌తి ఎస్‌పి.శైల‌జ న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌, సిఏవో శ్రీ శేష‌శైలేంద్ర‌, డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులురెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, పిఆర్వో డా. టి.ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.