PANCHAMI THEERTHAM IN EKANTAM ON DECEMBER 8 _ డిసెంబ‌రు 8న ఏకాంతంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

TIRUPATI, 06 DECEMBER 2021: The annual Karthika Brahmotsavams in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor will conclude on December 8 with Panchami Theertham which will be observed in Ekantam due to Covid restrictions.

The processional deity of Ammavaru and Sri Chakrattalwar will be brought to Vahana Mandapam and Snapana Tirumanjanam will be performed. Replica of the temple tank will be set up right in front of Vahana Mandapam where Panchami Theertham will be observed in the auspicious hour at 11.52am on Wednesday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబ‌రు 8న ఏకాంతంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

తిరుప‌తి, 2021 డిసెంబ‌రు 06: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక‌ కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబ‌రు 8న బుధ‌వారం ఉద‌యం 11.52 గంటలకు పంచమీ తీర్థం(చక్రస్నానం) ఏకాంతంగా జ‌రుగ‌నుంది. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

డిసెంబ‌రు 9న పుష్పయాగం

బ్ర‌హ్మోత్స‌వాల మ‌రుస‌టి రోజైన డిసెంబ‌రు 9వ తేదీ గురువారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ‌ముఖ మండ‌పంలో స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.