BTU OF SRI PRASANNA VENKATESWARA SWAMY AT APPALAYAGUNTA FROM JUNE 23 TO JULY 1_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

Tirupati, 4 June 2018: TTD Tirupati JEO Sri Pola Bhaskar today released the wall posters and other publicity materials of the Annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy Temple, Applayagunta.

Tirupati JEO said the Annual Brahmatosavam of the Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta will commence from June 23- July 1 and Koil Alwar Tirumanjanam will be performed on June 19 and Ankurarpanam on June 22 for the same.

He said the vahana sevas of the Brahmotsavams will commence from June 26 onwards both during mornings, evenings and nights. Kalyanotsavam will be held on June 26 evening. Intereested devotee couple could partiticpate with a ticket of Rs.500 for which they will beget one uttariuam, one blouse, one laddu and one appam.

As part of the event the artisans of HDPP, Dasa sahitya project will present devotional, bhakti sangeet and cultural programs like Kolatas.

Spl Gr Temple DyEO Sri Muniratnam Reddy and Temple Insepector Sri Srinivas were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2018 జూన్‌ 04: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఆయన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్‌ 23 నుండి జూలై 1వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జూన్‌ 19వ తేదీ మంగళవారం కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్‌ 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

23-06-2018(శనివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

24-06-2018(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం

25-06-2018(సోమవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

26-06-2018(మంగళవారం)కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

27-06-2018(బుధవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

28-06-2018(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం

29-06-2018(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

30-06-2018(శనివారం) రథోత్సవం అశ్వవాహనం

1-07-2018(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.