LATEST TECHNOLOGY FOR ELECTRICAL WIRING AT TIRUMALA_ TTD EO_ అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో తిరుమలలో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 4 June 2018: The TTD EO Sri Anil Kumar Singhal had directed official to utilize high quality and latest technology for laying electrical wiring in the hill shrine in order to provide a harmless and safe environment for lakhs of devotees that throng the hill shrine of Tirumala.

Addressing the Senior TTD Officers during review meeting in TTD Adm Building, the EO directed the SE-Sri Venkateswarlu that experts in electrical wiring and installations should be invited and asked to inspect all the key areas like – Srivari Temple, Rest houses, PACs, major road junctions etc. and submit a report.

He said all precautionary steps should be taken to protect the waiting sheds in Narayanagiri Gardens and other areas on Tirumala in view of rainy season and heavy winds hitting the hill shrine in the coming months. Steps should also be taken to arrest lighting and its damages, he instructed the engineering department officials.

The EO said all the big holes done at the steps of the Swami Pushkarini should be covered immediately to avoid inconvenience to devotees and the steps be cleaned without compromise on cleanliness all over Tirumala. He advised that the metal arches set up at four mada streets on which electrical and other systems were installed should be checked frequently for strength and stability.

The EO directed the IT officials to speed up the arrangements for installing IRIS technology at the Time slot sarva darshan counters. The installation of DFMDS equipment for rolling out network of scanners, CC TV cameras, head count machines should be completed in the month of June itself, he directed the in charge CVSO Sri Sivakumar Reddy. By august there should be 100 % and fool proof LED lighting in operation at Tirumala, he told the concerned officials.

He also asked the Tirupati JEO Sri Pola Bhaskar to complete the development works underway at Friday Gardens and Thollappa gardens connected to the Sri Padmavati Ammavari Temple, Trichanoor. The parking issue at the Sri Govindaraja Swamy Temple in Tirupati also should be resolve in consultation and coordination with concerned officials at the earliest, he told the JEO-Tirupati.

The EO said hand bills should be printed and distributed to devotees who opt for time slotted dashing tokens about the religious temples and places at Bugga, Narayanavanam, and Nagalapuram, Karveti nagaram, Appalayagunta and other local temples within Tirumala and Tirupati and encourage them to visit these locations.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji and other officials participated in the review meeting.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో తిరుమలలో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 జూన ్‌ 04: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ను క్రమ పద్దతిలో ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో సోమవారం ఉదయం ఆయన సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని శ్రీవారి ఆలయం, వసతి సముదాయాలు, వసతిగృహాలు, ప్రధాన కూడళ్ళు, తదితర ప్రాంతాలలో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌కు సంబంధించి, విద్యుత్‌ రంగంలో నిష్ణాతులను ఆహ్వానించి, వారితో అన్ని ప్రాంతాలలోని వైరింగ్‌ను తనిఖీ చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ఎలక్ట్రికల్‌ ఎస్‌ఇ శ్రీ వేంకటేశ్వర్లును ఆదేశించారు. రానున్న రోజులలో వర్షంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలలో భక్తుల కొరకు ఏర్పాటు చేసిన షెడ్లు ధృడంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదేవిధంగా పిడుగులు పడకుండా నివారణ చర్యలు (లైటింగ్‌ అరెస్ట్‌) తీసుకోవలసిందింగా ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

శ్రీ వరాహస్వామి ఆలయం ముందు పుష్కరిణి మెట్ల భాగంలో వివిధ పనులకుగాను ఏర్పాటు చేసిన రంధ్రాలను పూడ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శ్రీవారి పుష్కరిణిలో నీటిని, మెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్యంలో ఎక్కడ రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులు, వివిధ ప్రాంతాలలో లైటింగ్‌ కటౌట్ల కొరకు ఏర్పాటు చేసిన ఆర్చీలు ధృడంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.

సమయ నిర్ధేశిత సర్వదర్శనం కౌంటర్లకు సంబంధించి ఐరిష్‌ సాంకేతిక పరిజ్ఞాన్నాని అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని టిటిడి ఐటి విభాగం అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు సంబంధించి స్కానర్లు, సిసిటివిలు, హెడ్‌ కౌంట్‌ మిషన్లు, తనిఖీలు నిర్వహించే డిఎఫ్‌ఎమ్‌డిఎస్‌ యంత్రాల ఏర్పాట్లను జూన్‌ మాసం చివరికి పూర్తి చేయాలని టిటిడి ఇన్‌చార్జ్‌ సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డిని ఆదేశించారు. ఆగస్టు నెల కల్లా టిటిడిలో 100 శాతం ఎల్‌ఇడి లైటింగ్‌ పనులను పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత ఉన్న శుక్రవారపుతోట ( ఫ్రైడే గార్డెన్స్‌), తోళ్ళప్పగార్డెన్స్‌లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ను కోరారు. అదేవిధంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంవద్ద పార్కింగ్‌్‌ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, వారితో చర్చించి పార్కింగ్‌ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని తిరుపతి జెఈవోకు సూచించారు. సమయ నిర్ధేశిత సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తమ విరామ సమయంలో తిరుపతికి సమీపంలోని బుగ్గ, నారాయణవనం, నాగలాపురం, కార్వేటినగరం, అప్పలాయగుంట తదితర స్థానిక ఆలయాలు, తిరుమలలోని సందర్శనీయ స్థలాల సమాచారంతో కరపత్రాలు ముద్రించి భక్తులకు అందించడం ద్వారా వారుతమ విలువైన సమయాన్ని స్థానిక ఆలయాలను దర్శించేందుకు కేటాయిస్తారని ఈవో వివరించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.