BTU OF VONTIMITTA SRI KRT ENDS WITH DWAJA AVAROHANAM _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరాముడి బ్ర‌హ్మోత్స‌వాలు

Vontimitta, 29 Apr. 21: The imposing celebrations of Sri Ramanavami Brahmotsavam of Vontimetta Sri Kodandarama Swamy temple concluded on Thursday night with the solemn Dwaja Avarohanam fete held in ekantham due to Covid guidelines.

The Dwaja avarohanam fete was held between 7.00-8.00 pm amidst Veda mantras and Mangala vadyam by Kankana bhattar and other temple archakas.

Puranic legends say that the Dwaja avarohanam episode signalled farewell by Garuda to a galaxy of devatas who had arrived for Brahmotsavam and to visit again for next year’s celebrations.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరాముడి బ్ర‌హ్మోత్స‌వాలు

ఒంటిమిట్ట‌, 2021 ఏప్రిల్ 29: ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, కంక‌ణ బ‌ట్ట‌ర్‌ శ్రీ రాజేష్ భట్టార్, అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.