CARRY FORWARD THE VISION OF CJ WITH BLESSINGS OF LORD_ శ్రీ వారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| బి.రాధాకృష్ణన్‌

Tirumala, 8 July 2018: With the benign blessings of Lord Venkateswara, I will carry forward the vision of being the Chief Justice the High Court of both Telugu States, said Honourable CJ of High Court Justice B Radha Krishnan.

The CJ was on his maiden thanks giving visit to Tirumala. He had darshan of Lord twice on Sunday.

Speaking to media after darshan of Lord, the CJ said, that he is looking forward working with eminent people dealing with judiciary of the area. “The People of AP and TS are always known for their cultural identity and high level of education and their commitment towards national growth”, he added.

Earlier, the CJ has dardhan of Lord during Suprabhata Seva along with his family.

Later during break darshan, he offered prayers to Varaha Swamy, Swamy Pushkarini as per temple tradition. On his arrival at the main entrance of Tirumala temple, he was accorded Isthikaphal welcome by temple priests in a traditional manner.

After darshan of Lord Venkateswara, Vedasirvachanam was rendered at Ranganayakula Mandapam by vedic pundits. TTD EO Sri Anil Kumar Singhal, Tirumala In-charge JEO Sri P Bhaskar presented Sesha Vastrams, lamination photo of Lord, Teertha Prasadams to the Honourable Chief Justice of High Court of twin Telugu States.

Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Reception Officials Sri Balaji, Sri Lokanadham and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ వారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| బి.రాధాకృష్ణన్‌

జూలై 08, తిరుమల 2018: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ|| జస్టిస్‌ బి. రాధాకృష్ణన్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం విఐపి బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ప్రధాన న్యాయమూర్తికి టిటిడి ఛైర్మన్‌ శ్రీపుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ అర్చకుల ఇస్తీకపుల్‌ సాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఛైర్మన్‌, ఈవోలు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని గౌ|| ప్రధాన న్యాయమూర్తికి అందించారు.

అంతకుముందు ఆయన తలనీలాలు సమర్పించుకుని క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఆధ్యాత్మికచింతన, భక్తి భావం కలిగినవారన్నారు. ప్రజలకు ఉన్నతమైన న్యాయ సేవలు అందించేందుకు శక్తిని ఇవ్వలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఈవో శ్రీహరీంద్రనాధ్‌, పెష్కర్‌ శ్రీ రమేష్‌, డిప్యూటీఈవో శ్రీ బాలాజి, ఒఎస్డీ శ్రీ లోకనాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.