జూలై 18 నుంచి 29వ తేదీ వరకు కర్నూలు, కడప జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

జూలై 18 నుంచి 29వ తేదీ వరకు కర్నూలు, కడప జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 జూలై 8: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జూలై 18 నుంచి 29వ తేది వరకు కర్నూలు, కడప జిల్లాలలోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. ఈ నెల 27వ తేది చంద్రగ్రహణం కారణంగా కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సుంకేశుల గ్రామంలో ఉదయం 10 గంటలకు, మిగిలిన అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

కర్నూలు జిల్లాలో….

– జూలై 18వ తేదీన ఆళ్లగడ్డ మండలం, ఉయ్యాలవాడ గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆశ్రమం ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 19న జూపూడు బంగ్లా మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 20న ఆత్మకూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 21న వెలుగోడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 22న మహానంది మండలం, పుట్టుపల్లి గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 23న రుద్రవరం మండలం, యల్లవత్తుల గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

కడప జిల్లాలో …..

– జూలై 25 మైలవరం మండలం పెదకామెర్ల గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 26న చాపాడు మండలం, సీతారామపురం గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 27న ఖాజీపేట మండలంలోని కె.సుంకేశుల గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 28న ఒంటిమిట్ట మండలంలోని గుట్టకిందపల్లె గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 29న రాజంపేట మండలంలోని హస్తవరం గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.