CASE REGISTERED AGAINST THE MISCREANT FOR DEFAMING IMAGE OF TTD _ టిటిడిపై దుష్ప్ర‌చారం చేసిన వారిపై క్రిమిన‌ల్ కేసు

Tirumala, 2 Jan. 20: A case has been registered in the Tirumala Two Town Police Station by TTD Vigilance sleuths on Thursday, against the miscreant who sent a wrong message in Social Media defaming Tirupati Laddu. 

The message went viral in Social Media platform in Whatsapp with headline Tirupati Laddu or Jesus Laddu? on December 29.

TTD which has responded immediately to this fake message has registered a criminal case against the miscreant who sent the message which is completely baseless and ill-intentioned impacting on the reputation of the institution.

To put a check to such maliferous messages, a case,  Cr. No. 2/2020 U/s 500, 505(2)  IPC of 2 Town PS has been registered on the circulation of whatsapp message postings in social media by TTD Vigilance wing.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

టిటిడిపై దుష్ప్ర‌చారం చేసిన వారిపై క్రిమిన‌ల్ కేసు

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 02: సామాజిక మాధ్య‌మాల్లో తిరుప‌తి ల‌డ్డూ గురించి అవాస్త‌వాల‌ను వ్యాప్తి చేసి టిటిడిపై దుష్ప్ర‌చారం చేసిన వారిపై టిటిడి విజిలెన్స్ అధికారులు గురువారం తిరుమ‌ల‌లోని టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో క్రిమిన‌ల్‌ కేసు న‌మోదు చేశారు.
 
తిరుప‌తి ల‌డ్డా లేదా జీసెస్ ల‌డ్డా? అనే శీర్షిక‌తో డిసెంబ‌రు 29న వాట్సాప్‌లో ఒక స‌మాచారం విస్తృతంగా ప్ర‌చార‌మైంది. టిటిడి వెంట‌నే ఈ అవాస్త‌వ స‌మాచారాన్ని ఖండించింది. టిటిడి ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా వాట్సాప్‌లో ఈ స‌మాచారాన్ని పంపినవారిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసింది. ఇలాంటి అవాస్త‌వ స‌మాచారం ఇక‌పై సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం కాకుండా నిలువ‌రించేందుకు Cr. No. 2/2020 U/s 500, 505(2) IPC కేసును టిటిడి విజిలెన్స్ అధికారులు న‌మోదు చేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
 

content