ALL SET FOR VAIKUNTA EKADASI AND DWADASI DARSHANS AT TIRUMALA- EO _ వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు మెరుగైన ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 2 Jan. 20: All arrangements are in place for Vaikunta Ekadasi and Vaikuntha Dwadasi Dwara darshan in Srivari temple at Tirumala, said TTD EO Sri Anil Kumar Singhal.

Speaking to media, TTD EO said as in last year sheds with German technology are set up along mada streets providing shelter to 40,000 devotees. In the Narayanagiri gardens, sheds were already built at a cost of Rs.26 crores which will accommodate 30,000 devotees. TTD will allow about 15,000 to sit in VQC -2 from January 5 midnight onwards. In all, over 85,000 devotees would be provided shelter from inclement weather conditions.

After Dhanurmasa Kainkaryams, the VIPs will allowed for darshan from 2:30am onwards while the sarva darshan for common devotees will commence from 5am onwards.


He said all departments have been given specific tasks by additional Executive Officer Sri AV Dharma Reddy to gear up for the Vaikuntha Ekadasi rush. First the VQC queue lines waiting since January 5 will commence and later those waiting in mada streets will be brought to VQC.

Nearly 3500 Srivari Sevakulu are deployed to provide Anna Prasadam, distribute water and man queue lines. Apart from the volunteers 1300 scouts, 1100 TTD vigilance sleuths and 1900 district police have also been deployed. The vigilance and police will work in close coordination on traffic and parking issues in Tirumala with support of CCTV and mobile teams in Tirumala, he added. 

Earlier he inspected the arrangement of sheds in four mada streets, Narayanagiri Gardens, outside lines etc. 

Additional EO AV Sri Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramachandra Reddy and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు మెరుగైన ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 02: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నిర్వ‌హ‌ణ‌కు మెరుగ్గా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల‌ను గురువారం సాయంత్రం ఈవో త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ‌తేడాది త‌ర‌హాలోనే మాడ వీధుల్లో 40 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు వీలుగా జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు.  నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో రూ.26 కోట్ల‌తో నిర్మించిన షెడ్ల‌లో 30 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు వీలుంద‌న్నారు. జ‌న‌వ‌రి 5వ తేదీ అర్ధ‌రాత్రి నుండి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోకి 15 వేల మంది భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌న్నారు.  మొత్తం క‌లిపి 85 వేల మందికి పైగా భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు.  అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, తాగునీటి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. షెడ్ల‌కు అనుబంధంగా మరుగుదొడ్లు ఏర్పాటుచేశాం.

వైకుంఠ ఏకాద‌శి నాడు ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం ఉద‌యం 2.30 గంట‌ల నుండి విఐపిల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌ని, సామాన్య భ‌క్తుల‌ను ఉద‌యం 5 గంట‌ల నుండి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని ఈవో వివ‌రించారు. విశేషంగా విచ్చేసే భ‌క్తులకు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నార‌ని చెప్పారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం మాడ వీధుల్లోని భ‌క్తుల‌ను కంపార్ట్‌మెంట్ల‌లోకి అనుమ‌తిస్తామ‌న్నారు.

క్యూలైన్ల‌లో అన్న‌ప్ర‌సాదాలు, తాగునీటి పంపిణీకి సుమారు 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందిస్తార‌ని ఈవో తెలిపారు. వీరితోపాటు 1300 మంది స్కౌట్స్, 1100 మంది టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది, 1900 మంది పోలీసులు విధి నిర్వ‌హ‌ణ‌లో ఉంటార‌ని వెల్ల‌డించారు. టిటిడి భ‌ద్ర‌తా విభాగం, పోలీసులు స‌మ‌న్వ‌యం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్ర‌దేశాల‌ను గుర్తించార‌ని, వీరికి సిసిటివి సిబ్బంది, మొబైల్ బృందం స‌హ‌క‌రిస్తారి తెలిపారు.

ముందుగా మాడ వీధుల్లోని షెడ్లు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, బ‌య‌టి క్యూలైన్లను ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.