CHINNA SESHA VAHANA SEVA HELD _ చిన్నశేషవాహనంపై శ్రీ పాండురంగస్వామి అలంకారంలో శ్రీనివాసుడు
చిన్నశేషవాహనంపై శ్రీ పాండురంగస్వామి అలంకారంలో శ్రీనివాసుడు హైదరాబాద్ / తిరుపతి, 2025 ఫిబ్రవరి 27: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ పాండురంగస్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి రెండో రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి […]
