CD REFUND TO UPI PAYMENTS IN AN HOUR-TTD EO _ యుపిఐ విధానంలో గదులు పొందిన భక్తులకు ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ – డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirumala, 03 November 2023: TTD EO Sri AV Dharma Reddy on Friday reaffirmed that all devotees who made payments through UPI mode while taking rooms at Tirumala received caution deposits refunds to their bank accounts within one hour.

Addressing the devotees while live phone in the interaction program Dial your EO held at Annamaiah Bhavan on Friday in Tirumala, the EO said only if payments are paid for rooms by credit cards and debit cards, the refund of caution deposits to their bank accounts will be done 3-7working days.

He urged devotees to follow the requisite procedures while vacating rooms like submitting the verification code,  Facial Recognition etc. to avoid delays in the refund process.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

యుపిఐ విధానంలో గదులు పొందిన భక్తులకు ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ – డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023 న‌వంబ‌రు 03: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసి యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోంద‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్త‌న్నామ‌ని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్‌ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నార‌ని, భక్తులు తమ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ కాకపోతేనే సంప్రదించాలని కోరారు.

రీఫండ్‌ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నార‌ని, ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుండి 7 రోజులు వేచి ఉండడం లేదని వివ‌రించారు. మ‌రికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్‌ కోడ్‌ సబ్‌మిట్‌ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం లేదని వివ‌రించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.