GRAND UNVEILING OF ANNAMAIAH SNAKEERTHAN CDs_ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల ఆవిష్కరణ

Tirupati, 7 May 2018: On the holy muhurtam of Shravana nakshatram, the birth star of Lord Venkateswara two CDs of Annamaiah sankeertans produced by the TTD were released by Sri Munirathnam Reddy, OSD of the SV Recording Project.

The CD of Annamacharya Keerthanas- Annamaiah padayatras Mohana- choreographed by Sri P Ranganath and sung Smt Saidhavi. The other CD- Annamaiah Sri Venkatesh Bhagyamma- was choreographed by Sri Saikrishna Yachendra and sung by Smt Saindhavi.

Both singers rendered the sankeertans in their melodic voice at the event. The sankeertans are uploaded on the TTD website for free download by devotees.

Among others Tarigonda Vengamamba Project OSD Acharya KJ Krishnamurthy and officials and music lovers of Tirupati participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల ఆవిష్కరణ

మే 07, తిరుపతి, 2018: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం రెండు అన్నమయ్య సంకీర్తనల సిడిలను టిటిడి ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

”అన్నమయ్య ప‌ద మోహ‌నం” సిడిలోని కీర్త‌న‌ల‌ను శ్రీ పి.ఎస్‌.రంగ‌నాథ్ స్వ‌ర‌ప‌ర‌చ‌గా శ్రీ పి.ఎస్‌.రంగ‌నాథ్‌, శ్రీ‌మ‌తి సైంధ‌వి ఆల‌పించారు. ”అన్నమయ్య శ్రీ వేంక‌టేశ భాగ్యం” సిడిలోని కీర్తనలను శ్రీ సాయికృష్ణ యాచేంద్ర స్వ‌ర‌ప‌ర‌చ‌గా శ్రీ‌మ‌తి సైంధ‌వి గానం చేశారు. అనంతరం ఈ సిడిల్లోని కీర్తనలను వీరిరువురు అద్భుతంగా ఆలపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది.

ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.