CEMENT BAGS DONATED TO TTD_ శ్రీవారికి రూ.4 లక్షల రూపాయల విలువైన సిమెంటు విరాళం

Tirumala, 3 May 2018: Oriental Cements of CK Birla Group has donated 1000 cement bags worth Rs.4lakhs to TTD on Thursday morning.

The VIce President of Oriental Cements Sri Y Srinivasa Rao has handed over the 50 tonnes of the cement bags to Tirumala JEO Sri KS Sreenivasa Raju at Annamaiah Bhavan in Tirumala.

SE II Sri Ramachandra Reddy and other Engineering officials were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి రూ.4 లక్షల రూపాయల విలువైన సిమెంటు విరాళం

మే 03, తిరుమల 2018: సి.కె.బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రముఖ సిమెంటు తయారీ సంస్థ అయిన ఒరియంటల్‌ సిమెంటువారు హైదరాబాదు సమీపంలోని దేవాపూర్‌ ప్లాంట్‌లో బిర్లా ఏ-1 స్ట్రాంగ్‌క్రిట్‌ పేరున నూతనంగా విడుదల చేసిన తమ మొదటి ఉత్పత్తి 1000 సిమెంటు బస్తాలను శ్రీవారికి విరాళంగా అందించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంవద్ద గురువారం ఉదయం ఒరియంటల్‌ సిమెంటు వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ వై.శ్రీనివాసరావు రూ.4 లక్షలు విలువైన 50 టన్నుల సిమెంటు బస్తాలను తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు, ఒరియంటల్‌ సిమెంటు సి డ ఎఫ్‌ శ్రీ ఎమ్‌ఆర్‌సిరెడ్డి, బాబ్జీరెడ్డి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.