TRANSPARENT SERVICES THROUGH SSD COUNTERS-TIRUMALA JEO_ భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ : తిరుమల జెఈవో

Tirumala, 3 May 2018: To provide hassle free darshan without long waiting hours in compartments and queue lines, TTD has commenced Slotted Sarva Darshan (SSD) counters in Tirumala, Tirupati and footpath routes said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Speaking to media persons in Tirumala on Thursday, the JEO said, the slotted darshan system is running successfully in Rs.300 Special Entry Darshan and footpath darshan systems. A trial run of Slotted Darshan even in Sarva Darshan was attempted during December last which yielded fruitful results. Based on the feedback we developed the software and did soft launch for a few days before it is launched in a full-fledged manner from May 2 on wards. At present on total 109 counters are being operated as SSD in Tirumala, Tirupati and both footpath routes. Of these in CRO – 10, RTC bus stand – 8, Kousthubham – 8, Nandakam – 4, Srivari Mettu – 3(counters at MBC), Alipiri footpath – 12. While in Tirupati, Vishnunivasam – 22, Srinivasam – 5, Bhudevi Complex – 10, RTC Bus Stand – 12, Railway Station backside in II and III Chowltries – 8 counters were set up”, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ : తిరుమల జెఈవో

మే 03, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు పారదర్శకంగా సేవలందించే క్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లలో బుధవారం నుండి పూర్తి స్థాయిలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనం వద్ద గురువారం ఉదయం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

ఇదివరకు ప్రవేశ పెట్టిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం చేసుకొంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత ఏడాది జూలై నుండి శ్రీవారి మెట్టు, అలిపిరి నడకదారిలో తిరుమలకు విచ్చేసే భక్తులకు ప్రతి రోజు వారు కోరిన సమయానికి 20 వేల దివ్యదర్శనం టోకెన్లు కేటాయిస్తున్నామన్నారు. దివ్యదర్శనం భక్తులు ఏలాంటి నిరీక్షణ లేకుండా దాదాపు 2 గంటలలోపు స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్లు వివరించారు.

ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబరులో ఆధార్‌ నంబరు ద్వారా 6 రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం విజయవంతమైందన్నారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి విచ్చేసే భక్తులు ఆధార్‌ కార్డుతో వస్తే, నమోదు చేసుకొని వారు నిర్దేశిత సమయానికి స్వామివారి దర్శనం కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత 5 రోజులుగా పరిమితసంఖ్యలో భక్తులకు టోకెన్లు మంజూరు చేయడం ద్వారా అప్లికేషన్‌, దానిలోని సమస్యలను పూర్తిస్థాయిలో పరిశీలించి, పరిష్కరించినట్లు వివరించారు. మే 2వ తేదీ నుండి భక్తులకు పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు మంజురు చేస్తున్నట్లు తెలియచేశారు. టోకెన్లు పొందిన భక్తులు సమయం ఉన్న పక్షంలో తిరుపతిలోని ఆలయాలతోపాటు శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట, నారాయణవనం, చంద్రగిరి ఆలయాలు, తిరుమలలోని వివిధ ప్రాంతాలను దర్శించుకోవచ్చని సూచించారు.

– ప్రస్తుతం ఆధార్‌ కార్డు లేదా ఓటర్‌కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు.

– 12 నుండి 18 సంవత్సరాల వయస్సువారికి ఆధార్‌ లేదా ఐరిష్‌ ద్వారా టోకెన్లు కేటాయిస్తామన్నారు.

– తిరుమల, తిరుపతి, కాలినడక మార్గాల్లో 109 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తిరుమలలో – సిఆర్‌వో వద్ద 10 కౌంటర్లు, ఆర్టీసి బస్టాండ్‌లో 8 కౌంటర్లు, కౌస్తుభంవద్ద 8 కౌంటర్లు, నందకంలో 4 కౌంటర్లు, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు ఎమ్‌బిసిలో 3 కౌంటర్లు, శ్రీవారి మెట్టు మార్గంలో 7, అలిపిరి నడకమార్గంలో 12 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

తిరుపతిలో – విష్ణునివాసంలో – 22, శ్రీనివాసంలో – 5, భూదేవి కాంప్లెక్స్‌లో – 10, ఆర్టీసీ బస్టాండ్‌ – 12, రైల్వేస్టేషన్‌ వెనుకవైపుగల 2, 3 సత్రాలలో – 8 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.