BRAHMOTSAVAMS COMMENCES WITH DHWAJAROHANAM IN C”GIRI TEMPLE_ ధ్వజారోహణంతో వైభవంగా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Chandragiri, 27 March 2018: The annual brahmotsavams of Sri Kodanda Rama Swamy temple in Chandragiri commenced with Dhwajarohanam on Tuesday.

The Garuda flag was hoisted on the temple pillar between 8am and 9am amidst chanting of veda mantras.

Temple DyEO Sri Subramanyam and other temple staffs took part in this festival.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మార్చి 27, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. టిటిడి పాంచరాత్ర ఆగమసలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం చేపట్టారు. సాయంత్రం ఘంటానాదం, ఊంజల్‌సేవ జరుగనున్నాయి. మార్చి 28, 29, 31, ఏప్రిల్‌ 2, 3వ తేదీల్లో సాయంత్రం ఘంటానాదం, ఊంజల్‌సేవ చేపడతారు. మార్చి 30న రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్‌ 1న సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగనున్నాయి. ఏప్రిల్‌ 4న ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మూెత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్‌ 5వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, శ్రీఇజి.శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస భట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణచైతన్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.