“VASANTHA VANAM” GETS READY TO HOST VASANTHOTSAVAM_ శ్రీవారి వసంతోత్సవాలకు వసంతమండపం ముస్తాబు
Tirumala, 27 March 2018: The Vasantha Mandapam is getting ready to host the three day annual Vasanthotsavam in Tirumala from March 29 to March 31.
The Garden wing of TTD is making the arrangements to give an aesthetic feel to the participants by setting up “Vasantha Vanam”. The entire ecology consisting varieties of flora and fauna with torrents, waterfalls etc. are going to be replicated in a day’s time in the Vasantha Mandapam.
About 20 garden staffs worked for 10 days to bring out the Green Garden effect to Vasantha Mandapam. Smt Meenakshi Sundaram from Kumbhakonam has come forward to bear the entire expenditure for Vasantha Vanam.
Meanwhile the Vasanthotsavam is being celebrated as a summer refreshing festival and hence is also known as “Upsamanotsavam”.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీవారి వసంతోత్సవాలకు వసంతమండపం ముస్తాబు
మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తిరుమలలో వసంతోత్సవాలు
మార్చి 27, తిరుమల 2018: తిరుమలలో ఈ నెల 29వ తేదీ గురువారం నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వసంత మండపాన్ని భూలోకనందనవనంగా తీర్చిదిద్దుతున్నారు.
వసంత మండపంలో రమణీయ ప్రకృతి సౌదర్యం ఉట్టిపడేలా వృక్షాలు, తీగలు, ఆకులు, ఫలాలతో రూపొందిస్తున్న వసంత మండపంలో శ్రీవారు వేసవి తాపం నుండి ఉపసమనం పొందనున్నారు. ఈ వనంలో జింకలు, కుందేల్లు, నెమళ్ళు, ఆవు – దూడ, ఏనుగు, సింహం, పులి, ఖడ్గమృగం, సీతాకోకచిలుకలు, వంటి అనేక పశుపక్షాదులతో పాటు, ఈ సంవత్సరం ప్రత్యేకంగా జిరాఫి, జీబ్రా, దేవాంగపిల్లి సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సెలఏరు – జలపాతాలు, సింహల అరుపులు వినిపించేలా ఆడియో సిస్టం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేస్తున్నారు.
దాదాపు 20 మంది ఉద్యానవనశాఖ సిబ్బంది 10 రోజుల నుండి వసంత మండపాన్ని భూలోక నందనవనంగా రూపొందిస్తున్నారు. తమిళనాడులోని కుంబకోణానికి చెందిన దాత శ్రీమీనాక్షిసుందరం ఈ భూలోక స్వర్గాన్ని తలపించే ”వసంతవనం” ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టిటిడి ఉద్యానవనశాఖ ఉపసంచాలకులు శ్రీ శ్రీనివాస్ తెలిపారు.
మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తిరుమలలో వసంతోత్సవాలు
తిరుమలలో మార్చి 29 నుండి 31వ తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
మార్చి 29వ తేదీన ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతూ వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తియిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
మార్చి 30న స్వర్ణరథోత్సవం –
రెండవరోజు మార్చి 30వ తేదీన శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు బంగారు రథం అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
చివరిరోజు మార్చి 31వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు రద్దు –
వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని మార్చి 29వ తేదీన తిరుప్పావడసేవ, మార్చి 30వ తేదీన తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనంసేవలను రద్దు చేశారు. అదేవిధంగా మార్చి 29 నుండి 31వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు భక్తులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.