CHAIRMAN AND EO INSPECTS GALLERIESగ్యాలరీల్లో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్, ఈవో
Tirumala, 17 September 2018: TTD Chairman Sri P Sudhakar Yadav on Monday inspected Garuda Seva arrangements.
The TTD board chief said, all the Anna prasadam and water arrangements are well organised for Garuda Seva.
He said lakhs of pilgrims thronged Garuda Seva and TTD has made all sorts of arrangements for the big day.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
గ్యాలరీల్లో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్, ఈవో
సెప్టెంబరు 17, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజైన సోమవారం మధ్యాహ్నం ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, ఈసారి భక్తులకు అసౌకర్యం కలగకుండా చాలినన్ని మరుగుదొడ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు అందజేస్తామని వెల్లడించారు. మాడ వీధుల్లో భక్తులు వీక్షించేందుకు వీలుగా 19 డిస్‌ప్లే స్ర్కీన్లు ఏర్పాటుచేశామన్నారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు ప్రశాంతంగా గరుడసేవను తిలకించవచ్చన్నారు.
అంతకుముందు టిటిడి ఛైర్మన్, ఈవోలు మాడ వీధుల్లోని ప్రతి గ్యాలరీని, అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేశారు. శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉప్మా, టమోటా రైస్, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పాలు, కాఫి, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులకు అవసరమైన పక్షంలో వైద్యసేవలు అందించేందుకు వీలుగా వైద్యుల బృందం మందులను సిద్ధంగా ఉంచుకున్నారు. భక్తులు గ్యాలరీల నుండి తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భద్రత, ఇంజినీరింగ్ అధికారులకు ఛైర్మన్, ఈవో సూచించారు.
ఈ తనిఖీల్లో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్ఏ సిఏవో శ్రీ బాలాజి, ఎస్ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.