CHAIRMAN FELICITATES STUDENTS _ క్రీడా ప్రతిభా అవార్డుల విజేతలను సన్మానించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్
Tirupati, 20 October 2018 : TTD Chairman Sri P Sudhakar Yadav on Saturday felicitated students who excelled in games that took place in Nation’s capital in January.
The students studying in TTD education institutions took part in under 18 category games. They were felicitated by TTD Chairman Sri Sudhakar Yadav in Tirumala. He applauded the students who excelled in the 63rd Tung Sudo games held in New Delhi between 3-9 January.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
క్రీడా ప్రతిభా అవార్డుల విజేతలను సన్మానించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్
అక్టోబర్ 20, తిరుమల, 2018 ; ఈ ఏడాది జనవరి 3 నుండి 9వ తేది వరకు దేశరాజధాని ఢిల్లీలో జరిగిన 63వ జాతీయ స్కూల్ గేమ్స్ 2017 18 అండర్ 14,17,19 టంగ్ సూడో పోటీల్లో ప్రతిభ కనపరిచిన టిటిడి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను టిఎస్సార్ అతిథి గృహంలో గురువారం ఛైర్మెన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ సన్మానించారు.
టిటిడికి చెందిన పాఠశాలలు, కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థిని, విద్యార్థులకు క్రీడా ప్రతిభా అవార్డులు వచ్చాయి. ఇందులో అండర్ 14 విభాగంలో జి.భవిష్య, అండర్ 17 విభాగంలో భువనేశ్వరి, వాణి విశ్వనాథరెడ్డి, ఈరప్ప, అండర్ 19 విభాగంలో జి.శర్మి, కె. సులోచన, హరిణిరెడ్డి, కె.వంశీ, ఎ.విష్ణులు అవార్డులను తీసుకున్నారు. టిటిడి పాఠశాలలకు చెందిన కోచ్ శ్రీ కె.గోపినాయుడు, విజేతలను ఛైర్మెన్ అభినందించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.