HEAVY RUSH IN TIRUMALA _ భక్తుల రద్దీకి తగ్గట్లు టిటిడి ఏర్పాట్లు

Tirumala, 19 October 2018 : As the Dasara Holidays culminates on Sunday, Tirumala witnessed heavy pilgrim surge on Saturday where in all the compartments in VQC 1 and 2 were and lines extended to over 3km outside Narayanagiri Gardens.

Every inch of Tirumala is occupied by pilgrim inflow. TTD has made elaborate arrangements of food and water to cope up with the pilgrim rush.

The Srivari Seva volunteers served food and annaprasadams in compartments, queue lines, outside lines at regular intervals.

All the officers who are specially deployed for week end duties continuously monitored the facilities being provided to pilgrims by various departments.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల రద్దీకి తగ్గట్లు టిటిడి ఏర్పాట్లు

అక్టోబర్‌ 20, తిరుమల, 2018 ; పెరటాశి మాసం ముగింపు వారం, దసరా సెలవులు, వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలోని క్యూలైన్లు దాటి భక్తుల రద్దీ అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు సీనియర్‌ అధికారులకు కేటాయించిన ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, పుడ్‌ కౌంటర్లు, గోకులం అతిథి భవనం వద్ద, భక్తులు అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు వివిధ క్యూలైన్లలో వేచివున్న భక్తులకు క్రమం తప్పకుండా అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో అన్నప్రసాదం, త్రాగునీరు, కాఫీ, పాలు, టీ నిరంతరంగా అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో పారిశుద్ద్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన భక్తులకు వసతి సౌకర్యాన్ని కేటాయిస్తున్నారు.

మరోవైపు టిటిడి నిఘా మరియు భద్రతాధికారుల నేతృత్వంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ప్రాంతాలు, శ్రీవారి ఆలయం, క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులు ప్రవేశించే మార్గాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని క్యూలైన్లను క్రమబద్దీకరిస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లు లడ్డూ ప్రసాదాలను అందిస్తున్నారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా అనౌన్స్‌మెంట్స్‌ చేస్తున్నారు. ఈ సేవలలో టిటిడి సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు నిరంతరం సేవలందిస్తున్నారు.

ఈ కార్యకమ్రంలో టిటిడికి చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.