CHAIRMAN INAUGURATES COOPERATIVE BANK _ టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్

TIRUPATI, 10 JUNE 2022: TTD Chairman Sri YV Subba Reddy on Friday evening inaugurated the renovated the employees co-operative bank office at the TTD administrative buildings in Tirupati.

The Employees Cooperative bank premises functioning from the past 40 years has been modernized with central AC, Computers, software and furniture.

TTD chairman symbolically unveiled a plaque and inaugurated the office.

The Tirupati MLA Sri Karunakar Reddy, TTD board member Sri P Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam were present.

Bank chairperson Smt Hemalata Vice- President Sri Chintala Shiva Kumar, Treasurer Sri Chirla Kiran, Directors Sri Golconda Venkatesam, Sri Muni Venkata Reddy, Sri Adasavalli Vasu, Sri Kata Gunasekara were also present.

Later the Bank officials felicitated the TTD chairman, TTD board members and TTD officials with garlands and shawls.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్

తిరుపతి 10 జూన్ 2022: టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

గత 40 సంవత్సరాలుగా టీటీడీ పరిపాలన భవనంలో ఉన్న బ్యాంకు కార్యాలయాన్ని రూ 20 లక్షలతో ఆధునీకరించారు. ఇందులో సెంట్రల్ ఏసీ, కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్వేర్, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు.

ఇందుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఛైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ బోర్డ్ సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం పాల్గొన్నారు. బ్యాంకు చైర్ పర్సన్ శ్రీమతి బచ్చల హేమలత, ఉపాధ్యక్షుడు శ్రీ చింతల శివకుమార్, కోశాధికారి శ్రీ చీర్ల కిరణ్, డైరెక్టర్లు శ్రీ గోల్కొండ వెంకటేశం, శ్రీ అమ్మిటి మునివెంకటరెడ్డి, శ్రీ అడసలవల్లి వాసు, శ్రీ కాటా గుణశేఖర్ లు చైర్మన్, ఎమ్మెల్యే, బోర్డ్ సభ్యులకు స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది