CHAIRMAN INSPECTS ARRANGEMENTS FOR VAIKUNTHA DWARA DARSHAN _ వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు- తిరుమలలో ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

FOCUS ON ENABLING DARSHAN TO MORE DEVOTEES

OLD ANNAPRASADAM TO COME INTO UTILITY FROM JAN 1 ONWARDS

TIRUMALA, 28  DECEMBER 2022: In view of the ensuing ten-day Vaikuntha Dwara Darshan, TTD Chairman Sri YV Subba Reddy has inspected Vaikuntham compartments, SSD queue lines, Old Annaprasadam complex etc. along with TTD Additional EO(FAC) Sri Veerabrahmam on Wednesday evening.

After inspection, he said the focus is to provide Vaikuntha Dwara Darshan to more devotees during these ten days from January 2 to 11. “As such no referrals will be entertained from January 1 to 11  for VIP Break Darshan”, he asserted.

The Chairman also said, to avoid long waiting hours in queue lines and compartments, the devotees with SSD tokens and SED tickets have to come to Tirumala on their specified time slots and dates given to them. “In the wake of new guidelines released by Central and State Governments on COVID, the devotees coming for Darshan should wear masks which is mandatory”, he maintained. 

“Apart from the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) we have decided in the Board meeting to open up two more Annaprasadam Centres. From January 1 onwards, the Old Annaprasadam Complex located opposite Main Kalyana Katta Complex will become operational. Henceforth the devotees need not have to wait for their turn to have Annaprasadam”, he added.

Earlier the Chairman also interacted with the devotees about Darshan and other facilities to which they expressed immense pleasure. 

CEO SVBC Sri Shanmukh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, VGO Sri Bali Reddy, Annaprasadam Special Officer Sri Shastry and other officials were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు
 
– టోకెన్లు పొంది శ్రీవారి దర్శనానికి రండి
 
– జనవరి 1 నుండి పిఎసి-4లో అన్నప్రసాద వితరణ
 
– తిరుమలలో ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
తిరుమల, 28 డిసెంబరు 2022: నూతన ఆంగ్ల సంవత్సరాది జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి అదనపు ఈవో(ఎఫ్ఏసి) శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ఛైర్మన్ బుధవారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, పిఎసి-4 తదితర ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను   పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా త్వరితగతిన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల కోసం విఐపిల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు. స్వయంగా వచ్చే విఐపిలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు.
 
కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ తో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా గల పిఎసి-4లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని తెలియజేశారు. 
 
టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు భక్తులతో ఛైర్మన్ ముచ్చటించగా వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఛైర్మన్ వెంట ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, విజిఓ శ్రీ బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
 
టీటీడీ  ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.