CHAIRMAN INSPECTS DOWN GHAT ROAD _ మొదటి ఘాట్ రోడ్డులో టిటిడి ఛైర్మన్ తనిఖీలు
TIRUMALA, 15 NOVEMBER 2021: TTD Chairman Sri YV Subba Reddy on Monday inspected the first ghat road at some places.
Due to the recent heavy downpour, some hill rocks fell in the down ghat road. He inspected the point where rainwater is gushing over the hill rocks as Akkayyagarla Gudi. He verified whether there are any chances of the boulders and rocks fall.
Later he interacted with the pilgrims who are trekking Tirumala through Alipiri footpath and asked them about various amenities along the footpath and online darshan system.
The devotees expressed their pleasure over the arrangements by TTD.
Later he visited Gomandiram at Alipiri and instructed the concerned to complete fencing, arch works on a fast pace. He also directed the officials to erect information boards on Go puja, Gopradakshina etc.
TTD CE Sri Nageswara Rao was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మొదటి ఘాట్ రోడ్డులో టిటిడి ఛైర్మన్ తనిఖీలు
తిరుమల, 2021 నవంబరు 15: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
అక్కగార్ల గుడి వద్ద కొండ మీద నుంచి రోడ్డుపైకి జాలువారుతున్న వర్షపునీటి వల్ల కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందా అని పరిశీలించారు.
ఆ ప్రాంతంలో నడిచి వస్తున్న పలువురు భక్తులతో ముచ్చటించారు. నడక మార్గంలోని వసతులు, ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల లభ్యత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వసతులు బాగున్నాయని, దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాలాడి గుండం సమీపంలో కొండ చరియ మీద వర్షపు నీటి ప్రవాహం వల్ల వేర్లు బయటపడి కూలే స్థితిలో ఉన్న చెట్టును పరిశీలించి దాన్ని వెంటనే తొలగించి, కొండ చరియలు రోడ్డు మీద పడకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత అలిపిరి వద్ద సప్తగోప్రదక్షిణశాలను పరిశీలించి ఫెన్సింగ్, ఆర్చిల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడ గోపూజ, గోప్రదక్షిణ చేసుకోవచ్చనే విషయం భక్తులకు తెలిసేలా ఇరువైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఛైర్మన్ వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.