CHAIRMAN INSPECTS VARIOUS PLACES IN TIRUMALA_ తిరుమలలో టిటిడి ఛైర్మన్‌ విస్తృత తనిఖీలు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు

Tirumala, 8 June 2018: TTD Chairman Sri P Sudhakar Yadav inspected several places in Tirumala to verify darshan, accommodation, annaprasadam and laddu prasadam distribution processes, by interacting with the pilgrims on Friday.

As a part of his inspection, he instructed the concerned to set up additional food counters at PAC I for the sake of the pilgrims. He also instructed them to serve chutney along with upma for the pilgrims sitting in the compartments. Later he directed the officials to shift the mobile toilet located in ATGH area to some other place.

The Chairman also verified the Sarva Darshan Tokens issuing system and instructed the Radio and Broadcasting officials to give continuous announcements about the time slotted tokens availability status. He directed the officials concerned to lay carpets for the waiting pilgrims in Narayanagiri Gardens for the sake of the pilgrims.

The TTD Board Chief also visited the Laddu complex to see cleaning of laddu trays, boondi preparation, storage, sorting and distribution of Laddus. Later he directed the DFO Sri Phanikumar Naidu to ensure measures to see that the wild elephants will not enter in Srivari Padalu area. Later he checked the accommodation allotment process in SNC, CRO counters and also verified Angapradakshina Token counter.

SE II Sri Ramachandra Reddy, Health Officer Dr Sermista, VGO Sri Ravindra Reddy, Catering Officer Sri GLN Shastry were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో టిటిడి ఛైర్మన్‌ విస్తృత తనిఖీలు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు

జూన్‌ 08, తిరుమల, 2018: శ్రీవారి భక్తులకు దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాద వితరణ తదితర అంశాలపై టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ శుక్రవారం తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సర్వదర్శనం టోకెన్ల జారీని పరిశీలించిన ఛైర్మన్‌ దర్శన సమయాన్ని అడిగి తెలుసుకున్నారు. టోకెన్ల సంఖ్యను నిరంతరం అనౌన్స్‌మెంట్ల ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు. దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు అయిపోగానే ఆ విషయం భక్తులకు తెలిసేలా ప్రకటించాలన్నారు. లడ్డూ ట్రేలను శుభ్రం చేయడాన్ని, బూందీ తయారీని పరిశీలించారు. బూందీని ఆలయంలోకి పంపడం, లడ్డూల తయారీ అనంతరం నిల్వ చేయడం, లడ్డూ కౌంటర్లలో భక్తులకు లడ్డూలు పంపిణీ చేయడాన్ని తనిఖీ చేశారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులందరికీ ఉప్మాతోపాటు చట్నీ పంపిణీ చేయాలని సూచించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో వేచి ఉండే భక్తులు కూర్చొనేందుకు కార్పెట్లు ఏర్పాటు చేయాలన్నారు.

భక్తులు సందర్శించే శ్రీవారి పాదాల వద్ద ఏనుగులు సంచరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిఎఫ్‌వోకు ఛైర్మన్‌ సూచించారు. శేషాద్రినగర్‌ విచారణ కార్యాలయం, సిఆర్‌వో వద్ద గదుల కేటాయింపును పరిశీలించారు. పిఏసి-1 సమీపంలో అదనంగా ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మూడో విడత రింగ్‌ రోడ్డును పరిశీలించి నిర్దేశించిన ప్రకారం నాణ్యంగా పనులు చేయాలని ఆదేశించారు. ఆళ్వార్‌ ట్యాంకు విశ్రాంతిగృహం ప్రాంతంలో మొబైల్‌ మరుగుదొడ్లను అక్కడినుండి తరలించాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ఠ, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.