GEAR UP FOR APPALAYAGUNTA BTUs-TIRUPATI JEO_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలపై జెఈఓ సమీక్ష

Appalayagunta, 8 June 2018: As the annual brahmotsavams of the famous temple of Sri Prasanna Venkateswara Swamy at Appalayagunta are scheduled from June 23 to July 1, TTD Tirupati JEO Sri P Bhaskar, instructed the heads of various departments to make arrangements for the same within the time frame.

A review meeting was organised in the temple premises on Friday. The JEO instructed the Civil and Electrical wings to set up pandals, necessary barricade, rangoli, electrical illuminations etc. in the temple surroundings. Later he directed the Garden Wing Superintendent to make floral decorations in a befitting manner matching the occasion.

He instructed the Annaprasadam Special Officer Sri Venugopal to distribute annaprasadam to devotees during the big fete and Additional Health Officer Dr Sunil Kumar to make necessary sanitary arrangements and water distribution to pilgrims. “Utilise the services of Srivari Sevakulu for Annaprasadam, Water Distribution and manning devotees in the temple as well during Vahana Sevas”, he added.

On the security front, the JEO instructed VGO Sri Ashok Kumar Goud to utilise the services of Scouts and Guides to maintain security. He also instructed the HDPP, Dasa and Annamacharya Projects to send best artistes to perform during Unjal Seva.

The JEO said, the annual fete will commence with Dhwajarohanam on June 23 and the important days includes Kalyanotsavam on June 26, Garuda Seva on June 27, Rathotsavam on June 30 and Chakrasnanam on July 1.

Temple Spl.Gr.DyEO Sri Munirathnam Reddy, SEs Sri Ramulu, Sri Venkateswarulu, DyEO Sri GT Smt Varalakshmi, Garden Superintendent Sri Srinivasulu, SMO Dr Murali and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలపై జెఈఓ సమీక్ష

తిరుపతి, 2018 జూన్‌ 08: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 23 నుంచి జూలై 1వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీపోల భాస్కర్‌ శుక్రవారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్‌ 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్‌ 22న అంకురార్పణ, జూన్‌ 23న ధ్వజారోహణం, జూన్‌ 27న గరుడసేవ, జూన్‌ 30న రథోత్సవం, జూలై 1న చక్రస్నానం జరుగనున్నాయని తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్‌ 26వ తేదీ మంగళవారం సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు నిర్వహించే కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు వీక్షించేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చలువపందిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, బారికేడ్లు, అవసరమైన ఇంజినీరింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైదిక కార్యక్రమాల కోసం అవసరమయ్యే అర్చకులు, వేదపారాయణదారులను ఇతర ఆలయాల నుంచి డెప్యూటేషన్‌పై నియమించుకోవాలని తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారి వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించాలని జెఈవో ఆదేశించారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతపరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ అధికారులతో చర్చించి పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేయాలని సూచించారు. భక్తులను అలరించేలా విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకుని అప్పలాయగుంట, తిరుపతి పరిసర ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. స్వామివారి వాహనసేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఎస్‌ఇ శ్రీ శ్రీరాములు, ఎస్‌ఇ( ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీవేణుగోపాల్‌ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.