CHAIRMAN INVITED _ బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం

TIRUPATI, 18 FEBRUARY 2022: The TTD Chairman Sri YV Subba Reddy on Friday is invited for the ensuing annual Brahmotsavams at Srinivasa Mangapuram.

 

The Deputy EO Smt Shanti along with office staff formally met TTD Chairman at the latter’s camp office in Tirumala.

 

He is also invited for the Surutupalle Devasthanam annual fete by the concerned temple authorities.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం

తిరుమల 18 ఫిబ్రవరి 2022: శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని శుక్రవారం అధికారులు ఆహ్వానించారు.
ఆలయ డిప్యూటి ఈవో శ్రీమతి శాంతి, అర్చకులు శ్రీ బాలాజి, సూపరింటెండెంట్ శ్రీ ముని చెంగలరాయులు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

నాగలాపురం మండలం సురుటుపల్లి లోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి వారికి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించారు. శుక్రవారం తిరుమల క్యాంపు కార్యాలయంలో వారు టీటీడీ చైర్మన్ ను కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు.ఆలయ అర్చకులు ఆశీర్వాదం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి గీతా నారాయణ, శ్రీమతి గీతా మురళీ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ బాలిరెడ్డి రాధాకృష్ణారెడ్డి హాజరయ్యారు.