CHAIRMAN INVITES KARNATAKA CM FOR KARTHIKA DEEPOTSAVAM _ కార్తీక దీపోత్సవానికి హాజరు కండి – కర్ణాటక సిఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
TIRUMALA, 15 NOVEMBER 2021: As TTD is all set to observe Karthika Deepotsavam at Bengaluru on November 22, TTD Chairman Sri YV Subba Reddy has invited Karnataka Chief Minister Sri Basavarj Bommai to the event.
After the darshan of Sri Venkateswara Swamy, TTD Chairman invited Karanataka CM for breakfast on Monday at Tirumala. On this occasion, he extended an invitation to the Karnataka Chief Minister Sri Bommai to the spiritual event which is scheduled to take place at the Palace Grounds in Bengaluru on November 22.
Later he also explained on the various dharmic activities recently undertaken by TTD including Govinduniki Goadharita Naivedyam, Gudiko Gomata, Go Sammelanam, the launch of Kannada SVBC by Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on October 12.
While appreciating the efforts of TTD in Hindu Sanatana Dharma Prachara, the Karnataka CM asked the Chairman to promote Dasa Sahitya Programmes in the Kannada SVBC and also suggested to design special programmes for the same. He also assured that the Karnataka Government will always extend its co-operation to TTD in all its efforts of propagation of Hindu Sanatana Dharma.
TTD Board members Sri Sasidhar, Sri Vishwanatha Reddy and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కార్తీక దీపోత్సవానికి హాజరు కండి- కర్ణాటక సిఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 15 నవంబరు 2021: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవ రాజ్ బొమ్మైని ఆహ్వానించారు. తప్పకుండా హాజరవుతానని సిఎం చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగా అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగారు. ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు.
కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 19వ తేదీ తిరుపతి, 22వ తేదీ బెంగుళూరు, 29వ తేదీ విశాఖపట్నం లో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గత నెల 12వ తేదీ
ఎ పి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ప్రారంభించామని చైర్మన్ తెలిపారు. ఈ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. కన్నడ చానల్ లో దాస సాహిత్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి టీటీడీ ఛైర్మన్ ను కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. టీటీడీ చేప్పట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.
టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ శశిధర్, శ్రీ విశ్వనాథ రెడ్డి తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది