Chairman visit to Chandragiri Fort _ జూలై 14,15 వ తేదీలలో చంద్రగిరిలో శ్రీకృష్ణదేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు – టిటిడి చైర్మన్‌ డి.కె. ఆదికేశవులు

Tirupati, 9 July 2010: The 500-year coronation festival of Sri Krishnadevaraya will be conducted jointly by the State Government and TTD at Chandragiri Fort on July 14th  and 15th told Sri D.K.Audikesavulu, Chairman, TTD.  On Friday morning, he reviewed the arrangements for the smooth conduct of the 2-day festival with TTD and officials of District administration at his Camp Office in Tirumala.  He asked the officials to arrange flower decoration, photo exhibition and electrical illumination in and around Chandragiri fort.  He suggested the officials to change the venue of cultural activities from Mahathi Auditorium to Chandragiri fort during those two days.  Necessary publicity, Arches in important junctions both in Tirupati and Chandragiri, transportation facility etc. may be looked after by the district administration he added. 

Jayaho’ a dance ballet will also be played by Babu Cultural Organization of Kakinada at the venue.  Sri Prasad, RDO, Sri  Penchal Reddy, Vice-Chairman, TUDA, Sri Chandramouli, PD, DWAMA, Sri Sudhakar Rao, Superintending Engineer and other officials were present.  Later he visited Chandragiri fort and issued necessary instructions and suggestions to the officials on the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 14,15 వ తేదీలలో చంద్రగిరిలో శ్రీకృష్ణదేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు – టిటిడి చైర్మన్‌ డి.కె. ఆదికేశవులు

తిరుమల, 2010 జూలై 09: రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సంయుక్త ఆధ్వర్యంలో జూలై 14,15 వ తేదీలలో చంద్రగిరికోట నందు శ్రీకృష్ణదేవరాయల పంచశత పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నామని తితిదే పాలక మండలి చైర్మన్‌ డి.కె. ఆదికేశవులు తెలిపారు.

శుక్రవారం ఉదయం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయమునందు జిల్లా అధికారులు, తితిదే అధికారులతో ఆయన సమావేశమైనారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి కోటలో కాంతులు వెదజల్లే విద్యుత్‌ దీపాలంకరణ మరియు పుష్పాలంకరణ, ఫోటోఎగ్జిబిషన్‌కు కావలసిన ఏర్పాట్లు ముందస్తుగా చేయాలని తెలిపారు.

మహతి ఆడిటోరియంలో నిర్వహించదలసిన సాంస్కృతిక కార్యక్రమములు కూడా ఈరెండు రోజులు పాటు చంద్రగిరి కోటలోనే నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. అదేవిధంగా తిరుపతి-చంద్రగిరి లోని ముఖ్య కూడలిలలో శోభాయమానంగా ఆర్చీలను తీర్చిదిద్దాలని, చంద్రగిరి కోటకు వచ్చే ప్రజల సౌలభ్యం మేరకు రవాణా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు చూసించారు.

కాకినాడకు చెందిన బాబు సాంస్కృతిక మండలిచే శ్రీకృష్ణదేవరాయులపై ”జయహో” అను నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

ఈ రెండు రోజుల కార్యక్రమాలు అన్నీ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దసంఖ్యలో  పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి చంద్రగిరి కోటలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సమావేశంలో తితిదే అధికారులతో పాటు తిరుపతి ఆర్‌.డి.ఓ. ప్రసాద్‌, తుడా వైస్‌  చైర్మన్‌ పెంచల్‌రెడ్డి, డ్వామా పి.డి. చంద్రమౌళి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.