CHAKRA SNANAM HELD AT LOCAL TEMPLES _ టీటీడీ స్థానికాలయాల్లో చక్రస్నానం

TIRUPATI, 24 DECEMBER 2023: On the occasion of Vaikuntha Dwadasi, Chakra Snanam was observed in many TTD local temples in Tirupati on Sunday.

 

As a part of this, the Anthropomorphic form of Lord, Sri Sudarshana Chakrattalwar was rendered Snapana Tirumanjanam followed by holy Chakra Snanam in the sacred waters of the temple tank.

 

This religious fete was observed in Sri Padmavati Ammavaru temple at Tiruchanoor, Srinivasa Mangapuram and Appalayagunta.

 

While all the local temples of TTD including Sri Kodanda Ramalayam, Narayanavanam, Nagulapuram, Tondamanadu witnessed a huge turnout of devotees on the special occasion.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ స్థానికాలయాల్లో చక్రస్నానం

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 24: వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో ఆదివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు వేడుకగా తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

శ్రీనివాసమంగాపురం

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శని, ఆదివారాల్లో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉద‌యం చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.

అప్పలాయగుంటలోని

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం స్నపన తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, నారాయణవనం, నాగలాపురం, తొండమనాడు ఆలయాల్లో విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.