SOMASKANDAMURTHY GRACES ON FLOAT _ తెప్పలపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షం

Tirupati, 24 December 2023: On the third day evening on Sunday Sri Somaskandamurty Swamy took out a celestial ride on a finely decked float as part of the ongoing annual Teppotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati.

DyEO Devendra Babu and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పలపై శ్రీ సోమస్కందమూర్తి కటాక్షం
 
తిరుపతి, 2023, డిసెంబరు 24: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అభయమిచ్చారు.
 
 సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ సోమస్కందమూర్తి కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.